NTV Telugu Site icon

Myanmar Earthquake: మయన్మార్ భూకంపం ‘‘334 అణు బాంబులకు’’ సమానం..

Earthquake

Earthquake

Myanmar Earthquake: గత వారంలో మయన్మార్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం ఆ దేశాన్ని నాశనం చేసింది. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లోని పలు భవనాలు కుప్పకూలాయి. ముఖ్యంగా మయన్మార్ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు, 1700 మంది చనిపోయారు, ఇంకా శిథిలాల కింద వేల మంది ఉన్నారు. వీరి కోసం రెస్క్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం, భూకంపం వల్ల మొత్తం మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Read Also: Sanoj Mishra : మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్

ఇదిలా ఉంటే, ప్రముఖ అమెరిక్ జియోలజిస్ట్ ప్రకారం, మయన్మార్ భూకంపం ఏకంగా 300 కంటే ఎక్కువ అణు బాంబులకు సమానం అని చెప్పారు. ‘‘ఇలాంటి భూకంపం విడుదల చేసే శక్తి దాదాపుగా 334 అణు బాంబులకు సమానం’’ అని జియోలజిస్ట్ జెస్ ఫీనిక్స్ సీఎన్ఎన్‌కి చెప్పారు. శుక్రవారం మయన్మార్‌లో వచ్చిన భూకంపం తర్వాత వస్తున్న ప్రకంపనలు నెలల తరబడి కొనసాగవచ్చే అని ఆమె చెప్పారు. మయన్మార్ కింద ఉన్న ఇండియన్ టెక్లానిక్ ప్లేట్, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ కింద చొచ్చుకుపోతుండటం వల్ల ఈ భూకంపం వచ్చినట్లు ఆమె తెలిపారు.

నాలుగు ఏళ్ల క్రితం సైనిక తిరుగుబాటుతో చెలరేగిన అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ నాశనమైంది. 5 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఇప్పుడు భూకంపం కారణంగా మరిన్ని దెబ్బతింది. భూకంపం తర్వాత కూడా రెబల్స్ దాడులు చేస్తుండటం చూస్తే ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, భూకంప బాధిత దేశానికి సాయం అందించేందుకు భారత్ ఇప్పటికే ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ ప్రారంభించింది.