Walnut: “నా జీతం మీ స్టార్టప్ కన్నా ఎక్కువ”.. మహిళ ఉద్యోగి రిఫ్లైని రెండేళ్లైనా మర్చిపోలేకపోతున్న సీఈఓ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Walnut: కొన్ని సార్లు సోషల్ మీడియాలో శాశ్వతంగా నిలిచిపోయే చాటింగ్స్ జరుగుతుంటాయి. కొన్ని సార్లు కొంతమంది ఇచ్చిన రిప్లైలను ఎప్పటికీ మరిచిపోలేము. అలాంటిదే ‘వాల్‌నట్’ సీఈఓ రోషన్ పటేల్ కు ఓ మహిళ నుంచి ఎదురైంది. రెండేళ్ల క్రితం జరిగిన సంభాషణలను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 2021లో తన స్టార్టప్ లో పనిచేసేందుకు అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను నియమించుకోవాలని రోషన్ పటేల్ భావించాడు. ఆ సమయంలో అతని స్టార్టప్ కోసం ఫండింగ్ ప్రారంభం అయింది.
Read Also: India at UN: ఆ దేశాల స్వార్థప్రయోజనాలకే “వీటో”.. యూఎన్‌లో గళమెత్తిన భారత్..
Also Read
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
ఇందులో భాగంగా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేయాలని రోషన్ పటేల్ భావించాడు. సదరు మహిళకు ఈ ఉద్యోగంలో చేరే ఉద్దేశం ఉందో లేదో అని ప్రయత్నించాడు. నేను ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభిస్తున్నానని, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తక్కువ ధరలో అందించేందుకు వీలుగా ఈ స్టార్టప్ ప్రారంభిస్తున్నానని, దీని కోసం ప్రతిభావంతులైన ఇంజనీర్లను నియమించుకోవాలని అనుకుంటున్నానని, మీకు ఆసక్తి ఉందా..? అని రోషన్ పటేల్ సదరు మహిళా ఉద్యోగిని అడిగాడు. అయితే దీనికి మహిళా ఉద్యోగి రిఫ్లై ఇస్తూ..‘‘ హాయ్ రోషన్, ఇప్పుడే క్రంచ్ బేస్లో చెక్ చేశాను. నా ప్రస్తుత జీతం మీ స్టార్టప్ కు పెడుతున్న ప్రారంభ ఖర్చు కన్నా ఎక్కువ’’ అంటూ రిఫ్లై ఇచ్చింది. ఈ సమాధానం విన్న వెంటనే రోషన్ ఆమెతో చాటింగ్ కట్ చేశారు.
రెండేళ్ల తర్వాత ఈ చాటింగ్ హిస్టరీని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు రోషన్ పటేల్. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నానని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మహిళా ఉద్యోగికి అండగా నిలవగా.. మరికొందరు మాత్రం సీఈఓ స్థాయి వ్యక్తితో ఇలా మాట్లాడటం తగదని కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్టు వైరల్ అయింది. ఇప్పటి వరకు 3 మిలియన్ల మందిని దీన్ని వీక్షించగా.. 24 వేలమంది లైక్స్ చేశారు. వాల్‌నట్ న్యూయార్క్‌లో ఉంది, క్రంచ్‌బేస్ ప్రకారం.. ఇది ఏప్రిల్ 2021లో 3.6 మిలియన్ డాలర్లను సేకరించింది.
- Tags
- Roshan patel
- USA
- Viral Post
- Walnut
తాజావార్తలు
-
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్‌పాల్‌కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!