NTV Telugu Site icon

Walnut: “నా జీతం మీ స్టార్టప్ కన్నా ఎక్కువ”.. మహిళ ఉద్యోగి రిఫ్లైని రెండేళ్లైనా మర్చిపోలేకపోతున్న సీఈఓ

Roshan Patel

Roshan Patel

Walnut: కొన్ని సార్లు సోషల్ మీడియాలో శాశ్వతంగా నిలిచిపోయే చాటింగ్స్ జరుగుతుంటాయి. కొన్ని సార్లు కొంతమంది ఇచ్చిన రిప్లైలను ఎప్పటికీ మరిచిపోలేము. అలాంటిదే ‘వాల్‌నట్’ సీఈఓ రోషన్ పటేల్ కు ఓ మహిళ నుంచి ఎదురైంది. రెండేళ్ల క్రితం జరిగిన సంభాషణలను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 2021లో తన స్టార్టప్ లో పనిచేసేందుకు అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను నియమించుకోవాలని రోషన్ పటేల్ భావించాడు. ఆ సమయంలో అతని స్టార్టప్ కోసం ఫండింగ్ ప్రారంభం అయింది.

Read Also: India at UN: ఆ దేశాల స్వార్థప్రయోజనాలకే “వీటో”.. యూఎన్‌లో గళమెత్తిన భారత్..

ఇందులో భాగంగా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేయాలని రోషన్ పటేల్ భావించాడు. సదరు మహిళకు ఈ ఉద్యోగంలో చేరే ఉద్దేశం ఉందో లేదో అని ప్రయత్నించాడు. నేను ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభిస్తున్నానని, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తక్కువ ధరలో అందించేందుకు వీలుగా ఈ స్టార్టప్ ప్రారంభిస్తున్నానని, దీని కోసం ప్రతిభావంతులైన ఇంజనీర్లను నియమించుకోవాలని అనుకుంటున్నానని, మీకు ఆసక్తి ఉందా..? అని రోషన్ పటేల్ సదరు మహిళా ఉద్యోగిని అడిగాడు. అయితే దీనికి మహిళా ఉద్యోగి రిఫ్లై ఇస్తూ..‘‘ హాయ్ రోషన్, ఇప్పుడే క్రంచ్ బేస్లో చెక్ చేశాను. నా ప్రస్తుత జీతం మీ స్టార్టప్ కు పెడుతున్న ప్రారంభ ఖర్చు కన్నా ఎక్కువ’’ అంటూ రిఫ్లై ఇచ్చింది. ఈ సమాధానం విన్న వెంటనే రోషన్ ఆమెతో చాటింగ్ కట్ చేశారు.

రెండేళ్ల తర్వాత ఈ చాటింగ్ హిస్టరీని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు రోషన్ పటేల్. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నానని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మహిళా ఉద్యోగికి అండగా నిలవగా.. మరికొందరు మాత్రం సీఈఓ స్థాయి వ్యక్తితో ఇలా మాట్లాడటం తగదని కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్టు వైరల్ అయింది. ఇప్పటి వరకు 3 మిలియన్ల మందిని దీన్ని వీక్షించగా.. 24 వేలమంది లైక్స్ చేశారు. వాల్‌నట్ న్యూయార్క్‌లో ఉంది, క్రంచ్‌బేస్ ప్రకారం.. ఇది ఏప్రిల్ 2021లో 3.6 మిలియన్ డాలర్లను సేకరించింది.

Show comments