Site icon NTV Telugu

Elon Musk: భార్య, కొడుకు గురించి ఇంట్రెస్టింగ్ మేటర్ చెప్పిన మస్క్

Musk

Musk

టెస్లా అధినేత, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ తన భాగస్వామి గురించి కీలక విషయాలు పంచుకున్నారు. జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌‌లో మస్క్ పాల్గొని పలు కీలక విషయాలు పంచుకున్నారు.

భాగస్వామి శివోన్ జిలిస్ ఎక్కడ పెరిగిందని కామత్ అడిగినప్పుడు మస్క్ సమాధానం ఇస్తూ.. ఆమె పూర్వీకులు భారతీయులని.. శిశువుగా ఉన్నప్పుడే దత్తత కోసం ఇవ్వబడిందని చెప్పారు. తనకు కచ్చితమైన వివరాలు తెలియకపోయినా.. శిశువుగా ఉన్నప్పుడు మాత్రం దత్తత ఇవ్వబడిందనే విషయం మాత్రం కచ్చితమని.. అనంతరం కెనడాలో పెరిగినట్లు వివరించారు. అలా ఆమె ఇండియన్-అమెరికన్ అయిందని తెలిపారు. అంతేకాకుండా ఒక కొడుకు పేరు శేఖర్ అని కూడా చెప్పారు. ఇండియన్-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌‌లోని శేఖర్ అనే పదాన్ని ఒక కుమారుడికి పెట్టినట్లుగా వివరించారు.

జిలిస్ 2017లో మస్క్‌కు చెందిన ఐఏ కంపెనీ న్యూరాలింక్‌లో చేరారు. ప్రస్తుతం ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తు్న్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్స్ట్ పట్టా పొందారు. జిలిస్‌-మస్క్ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు, ఇద్దరు కవలలు స్ట్రైడర్, అజూర్, కుమార్తె ఆర్కాడియా, మరో కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ ఉన్నారు. ఒక కొడుకు పేరులో శేఖర్‌ను చేర్చారు.

ఇక పాడ్‌కాస్ట్‌లో మస్క్ మరికొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని తెలిపారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారినట్లుగా చెప్పారు. వీసా ఆంక్షల తర్వాత భారతీయులకు ఇబ్బందులు తలెత్తినట్లుగా పేర్కొన్నారు.

Exit mobile version