NTV Telugu Site icon

Turkey Earthquake: టర్కీ, సీరియాలలో భూప్రళయం.. 24 వేలు దాటిన మృతుల సంఖ్య

Turkey Earthquake

Turkey Earthquake

More Than 24 Thousand Killed In Turkey Syria Earthquake: భూప్రళయం ధాటికి శిథిలమయమైన టర్కీ, సిరియాలలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకూ ఆ రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 24 వేలు దాటింది. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉండటంతో.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టర్కీలో ఒక్క శుక్రవారంనాడే 100 మందికి పైగా బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని చోట్ల.. హృదయ విదారక దృశ్యాలూ కనిపిస్తున్నాయి. బయటపడే మార్గం లేక.. మూత్రం తాగి తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో.. అక్కడి శ్మశానాలు మృతదేహాలతో కిక్కిరిసిపోతున్నాయి.

T20 Womens World Cup: ఆతిథ్య సౌతాఫ్రికాకు షాక్..శ్రీలంక సూపర్ విక్టరీ

ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత భీకరమైన భూప్రళయంగా టర్కీ అధ్యక్షుడు తయీఫ్‌ ఎర్డోగాన్‌ వ్యాఖ్యానించారు. ఈ భూకంపం ధాటికి టర్కీ తీవ్రంగా నష్టపోయిందని, తమకు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. మరోవైపు.. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్, ఆయన భార్య అస్మా కలిపి శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను పరామర్శించారు. ఇదిలావుండగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటిదాకా టర్కీలో 19 వేల మందికిపైగా మరణించారని తేలింది. భవనాలన్నీ శిథిలాలు అవ్వడంతో.. 75 వేల మందికి పైగా జనం నిరాశ్రయులైనట్లు అక్కడి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించారు. 12 వేలకు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. సిరియాలో 3,300 కు పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలామంది నిరాశ్రయులు అయినట్లు అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది.

Hansika: ఈ హీరోయిన్ తన ఫ్రెండ్ భర్తనే లాగేసుకుందా?

కాగా.. భూకంపం ధాటికి కకావికలమైన టర్కీ, సిరియాలకు భారత్ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ శుక్రవారం మాట్లాడుతూ.. ‘ఆపరేషన్‌ దోస్త్‌’లో భాగంగా టర్కీ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మన దేశ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని అన్నారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాయని.. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి కృషి చేస్తూనే ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో టర్కీ ప్రజలకు భారత్‌ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.