Site icon NTV Telugu

Monkeypox: అది చేయడం వల్లే 95 శాతం మంకీపాక్స్ కేసులు

Monkeypox

Monkeypox

monkeypox-New England Journal of Medicine study: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో మూడు కేసులు నమోదు అయ్యాాయి. కేరళలో ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురు మంకీపాక్స్ బారిన పడ్డారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 71 దేశాల్లో 15,400 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మంకీపాక్స్ విస్తరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) రెండోసారి సమావేశం నిర్వహించింది. తాజాగా ఓ అధ్యయనం మంకీపాక్స్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన పరిశోధనల్లో 95 శాతం మంకీపాక్స్ కేసులు లైంగిక కార్యకలాపాల వల్లే సంక్రమిస్తున్నట్లు తేల్చింది.

లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీ సైంటిస్టుల ఈ అధ్యయనం చేశారు. ఏప్రిల్ 27 నుంచి జూన్ 24 మధ్య 16 దేశాల్లో 528 కేసులను అధ్యయనం చేసిన.. రోగుల వీర్యంలో మంకీపాక్స్ డీఎన్ఏ ఉందని గుర్తించారు. టెస్ట్ చేయించుకున్న 32 మందిలో 29 మందిలోొ దీన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే పలు స్టడీలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ముఖ్యంగా స్వలింగ సంపర్కం ద్వారా ఈ వ్యాధి మరింతగా వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్ దేశాల్లో మంకీపాక్స్ ఎక్కువ కావడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క యూరప్ ఖండంలోనే 86 శాతం కేసులు ఉన్నాయి. అమెరికాలో మరో 11 శాతం కేసులు నమోదు అయ్యాయి.

Read Also: African Swine Fever: కేరళలో మరో వైరస్ కలకలం.. పందులను చంపేయాలని ఆదేశం

మంకీపాక్స్ వల్ల పెద్దగా ప్రాణాపాయం ఏం లేదు. అయితే పది మందిలో ఒకరిలో మాత్రమే తీవ్ర ప్రభావాన్ని చూపించడంతో పాటు మరణానికి దారి తీస్తుంది. మశూచి లక్షణాలే మంకీపాక్స్ లో కనిపిస్తాయి. వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గర ఉండటంతో పాటు రోగి దగ్గు, తమ్ముల నుంచి, అతని వస్తువులు వాడితే మంకీపాక్స్ సోకే అవకాశం ఏక్కువగా ఉంటుంది. సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ రెండు వారాల్లో మంకీపాక్స్ వ్యాధి నుంచి నయమయ్యేలా సహకరిస్తుంది.

Exit mobile version