NTV Telugu Site icon

Monkeypox: ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

Monkeypox

Monkeypox

Monkeypox Declared A Global Health Emergency By WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ వ్యాధిని అసాధారణ సంఘటనగా పరిగణించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో పాటు వివిధ దేశాలకు విస్తరిస్తుండటంతో మంకీపాక్స్ ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలా..? వద్దా..? అనే అంశంపై చర్చింది. తాజాగా శనివారం రోజు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది.

ప్రపంచానికి మంకీపాక్స్ ను పెనుముప్పుగా డబ్ల్యూహెచ్ఓ పరిగణిస్తోంది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా డబ్ల్యూహెచ్ఓ కీలక చర్యలు తీసుకోనుంది. అయితే గత నెలలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్ ను ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ఓ నిరాకరించింది.. అయితే గత వారం నుంచి గణనీయంగా కేసుల సంఖ్య పెరగడంతో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో 16,000 పైగా కేసులు నమోదు అయ్యాయి. జూన్ చివరి నుంచి జూలై ప్రారంభం వరకు ఏకంగా కేసుల సంఖ్య 77 శాతానికి పెరిగింది. ఇటీవల భారత్ లో కూడా మూడు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గల్ఫ్ కంట్రీస్ నుంచి కేరళకు వచ్చిన ముగ్గురిలో వైరస్ ను గుర్తించారు.

Read Also: Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనం నుంచి పురాతన కళాఖండాలు మాయం

యూకేలో ప్రారంభం అయిన మంకీపాక్స్ కేసులు క్రమంగా యూరోపియన్ దేశాలకు వ్యాపించింది. ఇతర దేశాల్లో కూడా కేేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క యూరపియన్ దేశాల్లోనే 86 శాాతానికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో 11 శాతం కేసులు ఉన్నాయి. ఇటీవల పలు అధ్యయనాల్లో 95 శాతం కేసులు శృంగారం ద్వారానే సంక్రమిస్తుందని తేలింది.