NTV Telugu Site icon

Chicago: చికాగోలో హీరోయిన్స్‌తో దందా.. దోషిగా తేలిన ఆ నిర్మాత!

Chicago Prostitution Racket

Chicago Prostitution Racket

చికాగోలో రహస్యంగా నడిపిస్తున్న వ్యభిచారం దందాలో నిర్మాత మోదుగుమూడి కిషన్, భార్య చంద్రకళను కోర్టు దోషులుగా నిర్ధారించింది. తెలుగు యాంకర్లతో పాటు హీరోయిన్లతోనూ వీళ్ళు ఈ చీకటి దందాను నడిపిస్తున్నట్టు కోర్టు తేల్చింది. వీరికి 27 ఏళ్ల నుంచి 34 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇండియా నుంచి హీరోయిన్లు సహా యాంకర్లను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణలతో 2018లో పోలీసులు ఈ దంపతుల్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ల సుధీర్ఘ విచారణ తర్వాత కోర్టు వీరిని దోషులుగా తేల్చుతూ తీర్పునిచ్చింది. పలు సినిమాలకు సహ-నిర్మాతగా వ్యవహరించిన కిషన్.. 2014లోనే అమెరికాకు రావాలని ప్రయత్నించాడు. కానీ, అప్పుడు నకిలీ పత్రాలు సమర్పించడంతో వీసా లభించలేదు.

2015లో మాత్రం ఎలాగోలా వీసా సాధించిన ఈయన.. తన భార్యతో అక్కడికి వెళ్లాడు. వీసా సమయం గడువు ముగిసినప్పటికీ, అక్రమంగా అక్కడే నివసిస్తూ వస్తున్నాడు. ఓ వ్యభిచారం రాకెట్‌ను పోలీసులు రట్టు చేసినప్పుడు.. కిషన్ రహస్యాలు బట్టబయలయ్యాయి. ఈవెంట్లకు వచ్చిన వారితో ఒప్పందాలు కుదుర్చుకొని, ఈయన వ్యభిచారం నడిపేవాడని తేలింది. డబ్బులు ఆర్జించేందుకు కొందరు హీరోయిన్లు ప్రత్యేకంగా ఈ దందాలో భాగం అవ్వడం కోసమే ఇండియా నుంచి అమెరికాకు వచ్చేవారని తెలిసింది. ఇలాంటి వారికి ఈవెంట్ల పేరుతో ముందుగానే ఆహ్వానం పంపించేవారని, ప్రత్యేక వాహనాలతో పాటు హోటల్స్ సిద్ధం చేసేవారని బహిర్గతమైంది. విటుల నుంచి రెండు నుంచి మూడు వేల డాలర్ల వరకు వసూలు చేసేవారు. ఆ హీరోయిన్లలో చాలామంది ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నావారే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలింది.