Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం

  • మోడీ మంచి మిత్రుడు
  • ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు
  • మోడీపై ట్రంప్ ప్రశంసల వర్షం
  • జీ 7 సదస్సులో ఇరువురి ఆసక్తికర సంభాషణ
Pmmodi

Pmmodi

పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు కృషి చేసినందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ 7 సదస్సులో భాగంగా ట్రంప్‌తో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి నేతల మధ్య కీలక సంభాషణ జరిగింది.

ట్రంప్‌తో ప్రధాని మోడీ ఇలా అన్నారు.. ‘‘ప్రపంచానికి హార్ముజ్‌ను తెరవడం అత్యవసరం. సముద్రయాన స్వేచ్ఛను కచ్చితంగా కాపాడాలని.. దానిపై మనం ప్రత్యేక దృష్టి సారించాలని మేము ఎప్పుడూ చెబుతూనే ఉన్నాం. సముద్ర వాణిజ్య రంగంలో లక్షలాది మంది భారతీయ నావికులు ప్రపంచవ్యాప్తంగా వివిధ సముద్రాల్లో విధుల్లో ఉన్నారు. ఇది చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను… (ఇరాన్‌తో కుదిరే) ఒప్పందంలో నావికుల భద్రతకు భరోసా లభిస్తుందని.. వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని నాకు నమ్మకం ఉంది.’’ అని అన్నారు.

×
×
Ad

అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఫ్రాన్స్‌లో మాకు కొన్ని అద్భుతమైన సమావేశాలు జరిగాయి… ఇది G7 సమావేశం. త్వరలో G2, ఆ తర్వాత G20 సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా భారత ప్రధాని మోడీతో చాలా మంచి చర్చలు జరిగాయి. మేము వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం… అమెరికా-భారతదేశం మధ్య చాలా విషయాలు జరుగుతున్నాయి. అమెరికా అత్యుత్తమ స్థితిలో ఉంది. మా ఆర్థిక వ్యవస్థ 19.2 ట్రిలియన్ డాలర్లకు పైగా స్థాయికి చేరుకుంది. మేము కర్మాగారాలను, మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం. ప్రధాని మోడీ అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ చాలా ఖర్చు చేస్తున్నారు. ఆ కృషిని మేము అభినందిస్తున్నాం. మోడీ నాకు చాలా కాలంగా మిత్రుడు. మా మధ్య ఎప్పుడూ గొప్ప సంబంధం ఉంది. మీతో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉంది.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

‘‘నాకు భారతదేశం పట్ల చాలా గౌరవం ఉంది. మోడీ ఉన్నంతకాలం భారతదేశం పోషించాల్సిన పాత్ర చాలా ఉంది. మోడీ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ చాలా గట్టి మనిషి.’’ అని అభినందించారు.