Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- మోడీ మంచి మిత్రుడు
- ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు
- మోడీపై ట్రంప్ ప్రశంసల వర్షం
- జీ 7 సదస్సులో ఇరువురి ఆసక్తికర సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు కృషి చేసినందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ 7 సదస్సులో భాగంగా ట్రంప్‌తో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి నేతల మధ్య కీలక సంభాషణ జరిగింది.
ట్రంప్‌తో ప్రధాని మోడీ ఇలా అన్నారు.. ‘‘ప్రపంచానికి హార్ముజ్‌ను తెరవడం అత్యవసరం. సముద్రయాన స్వేచ్ఛను కచ్చితంగా కాపాడాలని.. దానిపై మనం ప్రత్యేక దృష్టి సారించాలని మేము ఎప్పుడూ చెబుతూనే ఉన్నాం. సముద్ర వాణిజ్య రంగంలో లక్షలాది మంది భారతీయ నావికులు ప్రపంచవ్యాప్తంగా వివిధ సముద్రాల్లో విధుల్లో ఉన్నారు. ఇది చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను… (ఇరాన్‌తో కుదిరే) ఒప్పందంలో నావికుల భద్రతకు భరోసా లభిస్తుందని.. వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని నాకు నమ్మకం ఉంది.’’ అని అన్నారు.
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఫ్రాన్స్‌లో మాకు కొన్ని అద్భుతమైన సమావేశాలు జరిగాయి… ఇది G7 సమావేశం. త్వరలో G2, ఆ తర్వాత G20 సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా భారత ప్రధాని మోడీతో చాలా మంచి చర్చలు జరిగాయి. మేము వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం… అమెరికా-భారతదేశం మధ్య చాలా విషయాలు జరుగుతున్నాయి. అమెరికా అత్యుత్తమ స్థితిలో ఉంది. మా ఆర్థిక వ్యవస్థ 19.2 ట్రిలియన్ డాలర్లకు పైగా స్థాయికి చేరుకుంది. మేము కర్మాగారాలను, మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం. ప్రధాని మోడీ అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ చాలా ఖర్చు చేస్తున్నారు. ఆ కృషిని మేము అభినందిస్తున్నాం. మోడీ నాకు చాలా కాలంగా మిత్రుడు. మా మధ్య ఎప్పుడూ గొప్ప సంబంధం ఉంది. మీతో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉంది.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
‘‘నాకు భారతదేశం పట్ల చాలా గౌరవం ఉంది. మోడీ ఉన్నంతకాలం భారతదేశం పోషించాల్సిన పాత్ర చాలా ఉంది. మోడీ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ చాలా గట్టి మనిషి.’’ అని అభినందించారు.
#WATCH | Evian, France | PM Modi tells US President Trump, "I commend you for your leadership on the progress in peace efforts in West Asia."
(Video: Reuters) pic.twitter.com/mFT73UPUWS
— ANI (@ANI) June 17, 2026
#WATCH | Evian, France | PM Modi tells US President Trump, "We have always said that freedom of navigation should be ensured and we should also stress upon that. Lakhs of Indian seafarers are om duty in different seas of the world in the sector of maritime trade. I believe that… pic.twitter.com/zeELdPyozB
— ANI (@ANI) June 17, 2026
#WATCH | Evian, France: Prime Minister Narendra Modi holds bilateral talks with US President Donald Trump on the sidelines of the G7 Summit 2026.
US President Donald Trump says, "We had some great meetings in France… It's a G7. We have a G2 coming up, and then we have a G20… pic.twitter.com/e2TVoQrvUI
— ANI (@ANI) June 17, 2026
తాజావార్తలు
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
ట్రెండింగ్
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..