Site icon NTV Telugu

PM Modi: మోడీ-పుతిన్-జిన్‌పింగ్ సంభాషణ.. ఎక్స్‌లో ఫొటోలు పెట్టిన మోడీ

Modi

Modi

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్, జిన్‌పింగ్ సంభాషించుకున్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను మోడీ ఆత్మీయంగా పలకించారు. షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని రాసుకొచ్చారు. ఇక టియాంజిన్‌లో షాంఘై శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ప్రారంభ ఉపన్యాసం జిన్‌పింగ్ చేయగా.. అనంతరం మోడీ ప్రసంగం ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: IMD Warning: సెప్టెంబర్‌లోనే అత్యధిక వర్షాలుంటాయి.. ఐఎండీ వార్నింగ్

భారత్‌పై అమెరికా భారీగా సుంకాలు విధించింది. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు 50 శాతం సుంకం విధించినట్లు ట్రంప్ తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా చైనా వేదికగా మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిశారు. ఈ భేటీ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

ఇది కూడా చదవండి: Trump: అలాగైతే అమెరికా నాశనమే.. టారిఫ్ తీర్పుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశానికి 11 దేశాల నేతలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక ఇందులో ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఉన్నారు. ఈ సమ్మిట్‌కు ఎస్‌సీవో దేశాలతో పాటు నేపాల్, మాల్దీవులు, తుర్కియే, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, మంగోలియా, తుర్క్‌మెనిస్తాన్, లావోస్, అర్మేనియా, అజర్‌బైజాన్ నాయకులంతా సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

 

Exit mobile version