Site icon NTV Telugu

Florida: భర్తను చంపి ఆత్మహత్య చేసుకున్న మోడల్ సబ్రినా క్రాస్నికీ

Sabrinakrasniqi

Sabrinakrasniqi

అమెరికాకు చెందిన మోడల్ సబ్రినా క్రాస్నిక్(27) జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఫ్లోరిడాలోని విలాసవంతమైన నివాసంలో విగతజీవిగా మారిపోయింది. ముందుగా భర్త పజ్తిమ్ క్రాస్నికీ(34) కాల్చి చంపి.. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.

ఇది కూడా చదవండి: Belly fat: రోజూ నిద్రించే ముందు మీ బెడ్‌పైనే ఈ రెండు వ్యాయామాలు చేయండి.. బెల్లీ ఫ్యాట్‌ తగ్గడం ఖాయం?

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. మోడల్ సబ్రినా క్రాస్నికీ.. ముందు భర్తను చంపి.. అటు తర్వాత ఆమె ప్రాణం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఘటన బుధవారం 12:30 గంటలకు జరిగినట్లు పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు మోడల్ కాండో బాల్కనీలో శవమై పడి ఉంది. వారిద్దరూ సొంత నివాసంలోనే చనిపోయి ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్య-ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి: M4M: కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే ఒక్కోక్క‌రికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తా!

భర్త ఛాతీలో 5 బుల్లెట్లు ఉన్నాయి. గాజు తలుపులో బుల్లెట్ రంధ్రాలు కనిపించాయి. సమీపంలో రక్తపు మడుగులు ఉన్నాయి. లోపల టెడ్డీ బేర్, దానిపై గుండె ఉన్న గులాబీల పెట్టె ఉంది. టీవీ అయితే ఆన్‌లైన్‌లోనే ఉంది. సబ్రినా క్రాస్నికీ 2021 ఇన్‌సైడ్ ఎడిషన్ విభాగంలో ఫీచర్ చేయబడిన మోడల్.

ఇది కూడా చదవండి: Kerala: రేప్ కేసులో సంచలన తీర్పు.. సవతి తండ్రికి 141 ఏళ్లు జైలు

Exit mobile version