సోమాలియాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం హిందూ మహాసముద్రంలోకి దూసుకెళ్లింది. ఎటువంటి పేలుడు జరగకుండా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Shopping Mall: షాపింగ్ మాల్‌లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే..!
స్టార్ స్కై ఏవియేషన్‌కు చెందిన ఫోకర్ విమానం మంగళవారం అడెన్ అబ్దుల్లె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 50 ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో బయల్దేరింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో మొగడిషు ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చేందుకు పైలట్ ప్రయత్నించాడు. రన్‌వేపై దింపేందుకు ఏ మాత్రం సాధ్యం కాలేదు. కానీ చాలా చాకచక్యంగా విమానాన్ని హిందూ సముద్రం ఒడ్డున దించేశాడు. ఎలాంటి పేలుడు జరగకుండా సేఫ్‌గా ల్యాండ్ అయింది. దీంతో అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు దిగిపోయారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి యువకుడి మృతి
ఇక పైలట్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు అందుతున్నాయి. సేఫ్‌గా ల్యాండ్ చేసి ప్రయాణికులను క్షేమంగా కాపాడినందుకు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. ఇక అత్యవసర ల్యాండింగ్‌కు గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది. ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం కిందికి దిగింది. కానీ రన్‌వేపై ఆగలేకపోయింది. టార్ రోడ్డును దాటి హిందూ మహాసముద్ర తీరం వెంబడి నిస్సార నీటిలో ఆగిపోయిందని CAA డైరెక్టర్ అహ్మద్ మకాలిన్ హసన్ తెలిపారు.
Today, a passenger aircraft operated by Starsky Aviation Ltd was involved in an incident near Aden Adde International Airport shortly after take-off. The plane, carrying 50 passengers bound for Guriel and Galkaayo, developed mechanical problems about 15 minutes into the flight… pic.twitter.com/9MaUeJ5UWw
— AUSSOM (@aussom_) February 10, 2026
A StarSky Fokker 50 crashes shortly after departure from Mogadishu Aden Adde International Airport, Somalia.
According to local reports all passengers have safely evacuated. pic.twitter.com/pYULsbv2Rm
— Breaking Aviation News & Videos (@aviationbrk) February 10, 2026