Somalia Video: సోమాలియాలో తప్పిన విమాన ప్రమాదం.. సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం

  • సోమాలియాలో తప్పిన విమాన ప్రమాదం
  • సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Somalia Video

Somalia Video

సోమాలియాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం హిందూ మహాసముద్రంలోకి దూసుకెళ్లింది. ఎటువంటి పేలుడు జరగకుండా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Shopping Mall: షాపింగ్ మాల్‌లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే..!

స్టార్‌ స్కై ఏవియేషన్‌కు చెందిన ఫోకర్ విమానం మంగళవారం అడెన్ అబ్దుల్లె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 50 ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో బయల్దేరింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో మొగడిషు ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చేందుకు పైలట్ ప్రయత్నించాడు. రన్‌వేపై దింపేందుకు ఏ మాత్రం సాధ్యం కాలేదు. కానీ చాలా చాకచక్యంగా విమానాన్ని హిందూ సముద్రం ఒడ్డున దించేశాడు. ఎలాంటి పేలుడు జరగకుండా సేఫ్‌గా ల్యాండ్ అయింది. దీంతో అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు దిగిపోయారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. ఓపెన్‌ మ్యాన్‌హోల్‌లో పడి యువకుడి మృతి

ఇక పైలట్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు అందుతున్నాయి. సేఫ్‌గా ల్యాండ్ చేసి ప్రయాణికులను క్షేమంగా కాపాడినందుకు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. ఇక అత్యవసర ల్యాండింగ్‌కు గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది. ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం కిందికి దిగింది. కానీ రన్‌వేపై ఆగలేకపోయింది. టార్ రోడ్డును దాటి హిందూ మహాసముద్ర తీరం వెంబడి నిస్సార నీటిలో ఆగిపోయిందని CAA డైరెక్టర్ అహ్మద్ మకాలిన్ హసన్ తెలిపారు.