NTV Telugu Site icon

Miss World: భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు

Miiss World

Miiss World

Miss World: అందాల పోటీకి భారత్‌ మరోసారి వేదిక కాబోతోంది. ప్రపంచ సుందరి-2023 పోటీలను ఇండియాలో నిర్వహించాలని మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్‌ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విషయాలను నిర్వహకులు గురువారం మీడియాకు తెలిపారు. సుమారు 27 సంవత్సరాల తరువాత మరోసారి ఇండియాలో 71వ ప్రపంచ సుందరీ-2023 పోటీలు జరగనున్నాయి.

Read also:Nirmala Sitharaman : నిరాడంబరంగా నిర్మలమ్మ బిడ్డ పెళ్లి.. వీఐపీలెవరూ లేరు

మరోసారి భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు జరగనున్నాయి. సుమారు 27 సంవత్సరాల తరువాత భారత్‌ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. 1996లో ప్రపంచ సుందరి అంతర్జాతీయ పోటీలకు ఇండియా వేదికగా అయింది. మళ్లీ ఇన్నాళ్లకు 71వ ప్రపంచ సుందరి-2023 ఫైనల్‌ పోటీలు నవంబర్‌ నెలలో ఇండియాలో జరగనున్నాయి. అయితే ఫైనల్‌ తేదిలు ఖరారు కావల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్‌ చైర్‌పర్సన్‌, సీఈవో జులియా మోర్లే గురువారం మీడియాకు తెలిపారు. 130 దేశాల ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నెల రోజులు విడిది చేయనున్నారని తెలిపారు. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడల సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయన్నారు. మార్పునకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వాటి ఉద్దశమని మోర్లే తెలిపారు. 2022 ప్రపంచ సుందరి విజేత కరోలినా బిలావ్‌స్కా మాట్లాడుతూ అందమైన ఇండియాలో తన కిరిటాన్ని తదుపరి విజేతకు అందించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని చెప్పారు. 2023 ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్‌ ఇండియా వరల్డ్ సినీ శెట్టి కూడా మీడియాతో మాట్లాడారు.
Read also: Nirmala Sitharaman : నిరాడంబరంగా నిర్మలమ్మ బిడ్డ పెళ్లి.. వీఐపీలెవరూ లేరు
ఇప్పటి వరకు ఇండియాకు చెందిన మహిళలు ఆరుసార్లు ప్రపంచ సుందరి పోటీల్లో విజేతలుగా నిలిచారు. రీటా ఫరియా(1966), ఐశ్వర్యారాయ్‌(1994), డయానా హెడెన్‌(1997), యుక్తాముఖి(1999), ప్రియాంకా చోప్రా(2000), మానుషి చిల్లర్‌(2017) వీరందరూ ఇప్పటి వరకు ప్రపంచ సుందరీమణులుగా ఎన్నికయ్యారు.