NTV Telugu Site icon

Turkey Earthquake: అద్భుతం.. శిథిలాల కింద బిడ్డ జననం.. కానీ..

Earthquake

Earthquake

Turkey Earthquake: టర్కీ దక్షిణ ప్రాంతంలో వచ్చిన భారీ భూకంపం ధాటికి టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతలో ఆ తరువాత 7.5, 6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. టర్కీ, సిరియా ప్రాంతాలు ఈ భూకంపాల ధాటికి తీవ్రగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 5000 మందికి పైగా ప్రజలు మరణించారు. శిథిలాలు తొలిగేకొద్ది మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మరణాల సంఖ్య దీనికి ఎనిమిదింతలు ఉంటుందని అంచానా వేస్తోంది. ఇదిలా ఉంటే ఇంతటి విషాదంలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి.

Read Also: Kim Jong Un: జాడలేని కిమ్.. 40 రోజులుగా అదృశ్యం

భూకంప ధాటికి బిల్డింగ్ కూలిపోయింది. అయితే ఆ శిథిలాల్లలోనే ఓ తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిథిలాల కిందే పరుడుపోసుకుంది. అయితే ఇక్కడ విషాధం ఏంటంటే బిడ్డ పుట్టగానే అనాథగా మారింది. శిథిలాల కిందే తల్లిదండ్రులు మరణించారు. భూకంప సమయంలో తల్లి తీవ్ర ప్రసవవేదనకు గురైంది. కానీ విపత్తు నుంచి బయటపడలేకపోయింది. ఈ ఘటన ఈశాన్య సిరియాలో చోటు చేసుకుంది.

ఈశాన్య సిరియాలోని అఫ్రిన్ ప్రాతంలోని జెండరెస్ లో తీవ్ర వర్షం, చలి వాతావరణంలో నవజాత శిశువు, తల్లిదండ్రులను కాపాడేందుకు రెస్య్కూ సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించింది. కానీ కేవలం బిడ్డను మాత్రమే రక్షించగలిగారు. సిరియాలో తీవ్ర యుద్ధం కారణంగా డీన్ ఎజోర్ ప్రాంతం నుంచి కుటుంబం అఫ్రిన్ కు వలస వచ్చింది. కాగా యుద్ధం నుంచి తప్పించుకున్నారు గానీ భూకంపం నుంచి బయటపడలేక పోయారు.