Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Millionaire Migration Continues Around The World High Net Worth People Moving To The Uae

Millionaires migration: వలస వెళ్తున్న “కుబేరులు”.. ఏ దేశాలకు ఎక్కువగా వెళ్తున్నారంటే..

Published Date :June 25, 2025 , 5:30 pm
By Venu Goapl Reddy
  • ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న మిలియనీర్ల వలసలు..
  • యూకే నుంచి ఎక్కువగా బయటకు వెళ్తున్న కుబేరులు..
  • హై నెట్ వర్త్ వ్యక్తులకు గమ్యస్థానంగా యూఏఈ, అమెరికా..
Millionaires migration: వలస వెళ్తున్న “కుబేరులు”.. ఏ దేశాలకు ఎక్కువగా వెళ్తున్నారంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Millionaires migration: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి మిలియనీర్లు వలస వెళ్తున్నారు. పెట్టుబడి ద్వారా నివాసం, పౌరసత్వం వంటి అంశాలను అధ్యయనం చేసే ప్రపంచ కన్సల్టెన్సీ దిగ్గజం హెన్లీ అండ్ పార్టనర్స్ నివేదిక ప్రకారం.. 2025లో 1,42,000 మంది మిలియనీర్లు కొత్త దేశానికి వలస వెళ్లే అవకాశం ఉందని చెప్పింది. “హై నెట్ వెల్త్ కలిగిన వ్యక్తులు(HNWIs)” అంటే, 1 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ లిక్విడ్ ఆస్తులు కలిగిన వారు. వీరు 2026 నాటికి 1,65,000 మంది సొంత దేశాలను వదిలి వేరే దేశాలకు వలస వెళ్తారని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2025 తెలిపింది.

ఈ ఏడాది 9800 మంది మిలియనీర్లు తమ కొత్త గమ్యస్థానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ని ఎంచుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బిలియనీర్ల వలసలకు యూఏఈ కేరాఫ్‌గా ఉంది. యూఎస్, ఇటలీ, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియాలకు కూడా మిలియనీర్లను ఆకర్షించే దేశాల జాబితాలో ఉన్నాయి. నివేదిక ప్రకారం, యూకే నుంచి అత్యధికంగా ‘‘అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు’’ వేరే దేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Vijay Anthony : తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పెరిగింది.. హీరో విజయ్ కామెంట్స్..

యూఏఈ ఎక్కువగా సంపన్న వ్యక్తులు కోరుకునే గమ్యస్థానంగా ఉంది. గతేడాది 6700 మంది నుంచి 2025 నాటికి ఈ వలసరలు 9800 మందికి చేరుతాయని, వీరంతా ఆ దేశంలో నివాసహోదా పొందుతారని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మిలియనీర్ల రాకలో అమెరికా రెండో స్థానంలో ఉంటుందని, 7500 మంది కొత్త మిలియనీర్లను అమెరికా ఆకర్షిస్తుందని అంచనా వేయగా, మూడోస్థానంలో ఇటలీ, నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంటుందని అంచనా. మరోవైపు, సౌదీ అరేబియా కూడా వేగంగా వృద్ధి సాధిస్తోంది. 2025 నాటికి 2400 మందికి పైగా కుబేరులు ఆ దేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 8 రెట్లు అధికం.

యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ఒకే ఏడాదిలో అతిపెద్ద సంపద వలసల్ని ఎదుర్కొంటోంది. 16,500 మంది HNWIలు వేరే దేశంలో నివాస హోదాను పొందుతారని అంచనా. సంపద వలసలో చైనా రెండో స్థానంలో అతిపెద్ద నష్టాన్ని ఎదుర్కొంటోంది. డ్రాగన్ దేశం నుంచి 7800 మంది మరొక దేశంలో నివాస హోదా పొందే అవకాశం ఉంది. ఆసియాలో దక్షిణ కొరియా నుంచి 2400 మంది మిలియనీర్లు బయట దేశాలకు వెళ్తున్నారు. ఇక ఇండియా నుంచి 3500 మంది మిలియనీర్లు బయటకు వెళ్తున్నారు. యూరప్‌లో అగ్రగామి దేశాలైన ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలు 2025లో అధిక నష్టాన్ని చవిచూస్తాయని అంచనా వేయబడింది. ఐర్లాండ్, నార్వే, స్వీడన్ నుంచి కూడా అధిక సంపద కలిగిన వారు నిష్క్రమిస్తున్నారు.

వలసల్ని స్వాగతించే విధానం, జీరో ఆదాయపు పన్ను, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రాజకీయ స్థిరత్వం యూఏఈని వలసలకు కేరాఫ్‌గా మార్చుతోంది. 2019లో ప్రవేశపెట్టబడిన, అర్హతను విస్తరించడానికి 2022లో సవరించబడిన UAE గోల్డెన్ వీసా కార్యక్రమం 5 లేదా 10 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే దీర్ఘకాలిక, రిన్యూవల్ నివాస వీసాను అందిస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Millionaires
  • Millionaires Migration
  • saudi arabia
  • UAE

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions