కెన్యా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో దేశ అట్టుడికింది. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవ్వడంతో పరిస్థితులు చేయిదాటి హింసాత్మకంగా మారింది. పోలీసులకు-నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితులు మొత్తం రణరంగంగా మారాయి. పార్లమెంట్ ముట్టడి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. పోలీసులు టియర్ గ్యాస్, నీటి ఫిరంగులు, కాల్పులు జరిపారు.
ఇది కూడా చదవండి: Sathya in Badvel: బద్వేల్‌లో సత్య ఏజెన్సీస్ 23వ షోరూం ప్రారంభం.. భారీ ఆఫర్లు.. త్వరపడండి!
కెన్యా పార్లమెంట్‌లో కొత్త పన్నుల బిల్లును ఆమోదించింది. దీంతో జనాల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. నెమ్మదిగా ప్రారంభమైన నిరసనలు.. క్రమక్రమంగా ఉద్రిక్తంగా మారాయి. ఇక మంగళవారం పార్లమెంట్ బిల్లు ఆమోదించడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనలు చేపట్టారు. మరోవైపు నిరసనకారులు పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టడంతో కొంత భాగం కాలి పోయింది. పరిస్థితులు మరింత ఉధృతంగా మారకుండా మిలటరీ రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.
ఇది కూడా చదవండి: Jagga Reddy: రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఉంటే.. మేమే ఐటీఐఆర్ తెచ్చే వాళ్ళం..!