Pakistan: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా అనేక కారణాలతో పాకిస్తాన్ సతమవుతోంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్‌లో కొద్దోగొప్పో ఉన్న టెక్నాలజీ కంపెనీలు కూడా తమ కార్యాలయాలను మూసేస్తున్నాయి. టెక్ దిగ్గజం ‘‘మైక్రోసాఫ్ట్’’ జూలై 3, 2025 నుంచి పాకిస్తాన్ నుంచి నిష్క్రమించింది. కనీసం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే ఆ దేశం నుంచి వెళ్లిపోయింది. పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ చీఫ్‌గా ఉన్న జావాద్ రెహ్మాన్ ఈ విషయాన్ని బయటపెట్టారు. దీనిని ‘‘ ఒక యుగం ముగింపు’’ అని అభివర్ణించారు.
25 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌లో డిజిటల్ వృద్ధిని రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ మార్చి 7, 2000లో ఆ దేశంలోకి ప్రవేశించింది. ఇప్పుడు తన పావు శతాబ్ధపు బంధాన్ని తెంచుకుంది. మైక్రోసాఫ్ట్ తన నిష్క్రమణకు ఎలాంటి కారణాలు చెప్పనప్పటికీ, ఈ చర్య వెనక రాజకీయ, ఆర్థిక గందరగోళం, పేలవమైన వాణిజ్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ దేశ పరిశీలకులు చెబుతున్నారు. ఈ కారణాలతో పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ పనిచేయడం అసాధ్యంగా చేశాయి. దేశ ఆర్థిక సంవత్సరం 2024 వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది, జూన్ 2025లో నిల్వలు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి, ఇది టెక్ దిగుమతులు మరియు విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేసింది.
Read Also: Tamil Nadu: సీఎం అభ్యర్థిగా స్టార్ హీరో విజయ్.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ..
దీంతో పాటు పేదరికంతో బాధపడుతున్న పాకిస్తాన్‌లో స్థానిక ప్రతిభ కూడా లేదు. స్థానిక ప్రతిభ, సామర్థ్యం లేకపోవడం, పాకిస్తాన్‌లో తెలివైన సాంకేతిక నిపుణుల కొరత లేదా మార్కెట్ డిమాండ్ లేదు. మల్టీనేషనల్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగించడానికి అవసరమైన రాజకీయ, ఆర్థిక పరిస్థితులు లేకపోవడంతోనే టెక్ కంపెనీలు పాక్ నుంచి వెళ్లిపోతున్నాయి.
ఇదే కాకుండా, భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే టెక్ రంగంలో అగ్రగామిగా ఉంది. ప్రపంచంలోని టెక్ ప్లేయర్లు తమ పెట్టుబడులకు భారత్‌ని మంచి గమ్యస్థానంగా చూస్తున్నాయి. దేశంలో స్థిరమైన ప్రభుత్వం, విధానాలు, పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బలమైన దౌత్య సంబంధాలతో భారత్ ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ దేశంగా కనిపిస్తోంది. మరోవైపు, పాకిస్తాన్‌లో ఉగ్రవాదం, మదరసా విద్య అక్కడి యువతలో నైపుణ్యాలు లేకుండా చేస్తున్నాయి.
