Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Microsoft Shuts Down Pakistan Office After 25 Years Amid Instability

Pakistan: పాకిస్తాన్‌కు గుడ్ బై చెప్పిన ‘‘మైక్రోసాఫ్ట్’’.. 25 ఏళ్ల తర్వాత ఆఫీస్ క్లోజ్..

Published Date :July 4, 2025 , 3:55 pm
By Venu Goapl Reddy
  • 25 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్ బై..
  • రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభమే కారణం..
  • టెక్ పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్..
Pakistan: పాకిస్తాన్‌కు గుడ్ బై చెప్పిన ‘‘మైక్రోసాఫ్ట్’’.. 25 ఏళ్ల తర్వాత ఆఫీస్ క్లోజ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా అనేక కారణాలతో పాకిస్తాన్ సతమవుతోంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్‌లో కొద్దోగొప్పో ఉన్న టెక్నాలజీ కంపెనీలు కూడా తమ కార్యాలయాలను మూసేస్తున్నాయి. టెక్ దిగ్గజం ‘‘మైక్రోసాఫ్ట్’’ జూలై 3, 2025 నుంచి పాకిస్తాన్ నుంచి నిష్క్రమించింది. కనీసం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే ఆ దేశం నుంచి వెళ్లిపోయింది. పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ చీఫ్‌గా ఉన్న జావాద్ రెహ్మాన్ ఈ విషయాన్ని బయటపెట్టారు. దీనిని ‘‘ ఒక యుగం ముగింపు’’ అని అభివర్ణించారు.

25 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌లో డిజిటల్ వృద్ధిని రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ మార్చి 7, 2000లో ఆ దేశంలోకి ప్రవేశించింది. ఇప్పుడు తన పావు శతాబ్ధపు బంధాన్ని తెంచుకుంది. మైక్రోసాఫ్ట్ తన నిష్క్రమణకు ఎలాంటి కారణాలు చెప్పనప్పటికీ, ఈ చర్య వెనక రాజకీయ, ఆర్థిక గందరగోళం, పేలవమైన వాణిజ్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ దేశ పరిశీలకులు చెబుతున్నారు. ఈ కారణాలతో పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ పనిచేయడం అసాధ్యంగా చేశాయి. దేశ ఆర్థిక సంవత్సరం 2024 వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది, జూన్ 2025లో నిల్వలు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి, ఇది టెక్ దిగుమతులు మరియు విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేసింది.

Read Also: Tamil Nadu: సీఎం అభ్యర్థిగా స్టార్ హీరో విజయ్.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ..

దీంతో పాటు పేదరికంతో బాధపడుతున్న పాకిస్తాన్‌లో స్థానిక ప్రతిభ కూడా లేదు. స్థానిక ప్రతిభ, సామర్థ్యం లేకపోవడం, పాకిస్తాన్‌లో తెలివైన సాంకేతిక నిపుణుల కొరత లేదా మార్కెట్ డిమాండ్ లేదు. మల్టీనేషనల్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగించడానికి అవసరమైన రాజకీయ, ఆర్థిక పరిస్థితులు లేకపోవడంతోనే టెక్ కంపెనీలు పాక్ నుంచి వెళ్లిపోతున్నాయి.

ఇదే కాకుండా, భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే టెక్ రంగంలో అగ్రగామిగా ఉంది. ప్రపంచంలోని టెక్ ప్లేయర్లు తమ పెట్టుబడులకు భారత్‌ని మంచి గమ్యస్థానంగా చూస్తున్నాయి. దేశంలో స్థిరమైన ప్రభుత్వం, విధానాలు, పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బలమైన దౌత్య సంబంధాలతో భారత్ ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ దేశంగా కనిపిస్తోంది. మరోవైపు, పాకిస్తాన్‌లో ఉగ్రవాదం, మదరసా విద్య అక్కడి యువతలో నైపుణ్యాలు లేకుండా చేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India vs Pakistan tech industry
  • Jawwad Rehman Microsoft
  • Microsoft digital Pakistan
  • Microsoft exits Pakistan 2025
  • Microsoft Pakistan office closed

తాజావార్తలు

  • Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

  • David Miller: డ్రెస్సింగ్ రూమ్‌ వీడియో రిలీజ్.. మిల్లర్ ఒంటరిగా కూర్చొని ఎలా ఏడుస్తున్నాడో చూడండి..

  • Oppo A6s Pro: 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. ఒప్పో కొత్త 5G ఫోన్‌ విడుదల

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions