Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
- సుమారు 36 గంటల అంతరాయం తర్వాత మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ..
- అందుబాటులోకి Outlook, Teams, Copilot, సేవలు..
- 70 దేశాలపై ప్రభావం, లక్షల రూపాయల నష్టం..
- నెట్వర్క్ సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేసే సమయంలో సాంకేతిక లోపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Outage: సుమారు 36 గంటల పాటు సుదీర్ఘ అంతరాయం తర్వాత మైక్రోసాఫ్ట్ సేవలు గాడినపడ్డాయి. Outlook, Microsoft Teams, Copilot సహా పలు సేవలు తిరిగి సాధారణంగా పనిచేస్తున్నాయని కంపెనీ ప్రకటించింది. నవంబర్ 12న సేవల్లో ఏర్పడిన అంతరాయాన్ని పరిష్కరించేందుకు చాలా సమయం ప్రయత్నించినట్లు వెల్లడించింది. సేవల్లో అంతరాయం కలిగినందుకు వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది.
36 గంటల తర్వాత మైక్రోసాఫ్ట్ సేవలు..
నవంబర్ 14న సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ శనివారం ప్రకటించింది. దీంతో ఈ-మెయిల్స్, ఆఫీస్ అప్లికేషన్లు, ఆన్లైన్ సమావేశాలు, ఇతర సేవల్ని వినియోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న కోట్లాది మంది వినియోగదారులకు ఊరట లభించింది.
Also Read
- Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
- Trump Asia Tour: చైనాలో ఒకే వేదికపై ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. తొలిసారి చరిత్రాత్మక భేటీ!
- Qatar-Turkey Defence Agreement: గల్ఫ్‌లో ఉద్రిక్తతల వేళ.. ఖతార్, టర్కి సంచలన రక్షణ ఒప్పందం!
- US Flight Chaos: అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత.. కమ్యూనికేషన్ లోపంతో దేశవ్యాప్తంగా ఫ్లైట్స్ గ్రౌండ్
దీనికి ముందు నవంబర్ 12న మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. అవుట్ లుక్, టీమ్స్, కోపైలట్, షేర్‌పాయింట్, టూ డూ సహా పలు మైక్రోసాఫ్ట్ సేవలు ప్రభావితమయ్యాయి. వినియోగదారులు తమ మెయిల్ బాక్స్ తెరవడం, మెసేజ్‌లు చదవడం, ఆన్లైన్ మీటింగ్స్‌లో పాల్గొనడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
70 దేశాలపై ప్రభావం, మిలియన్ల నష్టం..
మైక్రోసాఫ్ట్ అంతరాయం వల్ల దాదాపుగా 70 దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, సాధారణ యూజర్లు మైక్రోసాఫ్ట్ సేవల్ని వినియోగించలేకపోయారు. ఈ అంతరాయం వల్ల వ్యాపార కార్యాకలపాలు నిలిచిపోయాయి. దీంతో సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. గంటకు సుమారు 9.4 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. 36 గంటల అంతరాయంలో ఎంత మేర నష్టం జరిగిందనే దానికి ఖచ్చితమైన అధికారి లెక్కలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
నెట్వర్క్ అప్‌గ్రేడ్ సమయంలో సాంకేతిక సమస్య..
సేవల్లో ఏర్పడిన అంతరాయానికి మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్లకు క్షమాపణలు చెప్పింది. ఈ సాంకేతిక సమస్యకు నెట్వర్క్ సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేసే సమయంలో తలెత్తిన లోపమే కారణమని కంపెనీ వెల్లడించింది. ఈ అంతరాయానికి సైబర్ దాడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ల ప్రమేయం లేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
-
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
-
AP Assembly: పేపర్‌లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్‌లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..
-
Singur Project: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.. రెండు గేట్లు ఎత్తిన అధికారులు
-
Giribabu: భయపెట్టే విలన్, నవ్వించే కమెడియన్.. గిరిబాబు జీవితంలోని ఆసక్తికర కోణాలివే!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!