Meta to Lay Off More Than 11,000 Employees: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా ఇదే దారిలో మరో టెక్ దిగ్గజం ఉద్యోగుల తొలగింపుకు సిద్ధం అయింది. ఫేస్ బుక్ మాతృ సంస్థ ‘మెటా’ తన ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. 2022 ఏడాదిలో అతిపెద్ద తొలగింపుకు మెటా సిద్దం అయింది. 11,000 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం ఉద్యోగులను తొలగించనుంది. ఈ విషయాన్ని మెటా సంస్థ బుధవారం వెల్లడించింది.
Read Also: Telangana Governor Tamilisai Comments Live: గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక మాంద్యం భయాలతో పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. తాజాగా మెటా కూడా ఈ జాబితాలో చేరింది. మెటా 18 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయిలో ఉద్యోగాలను తొలగిస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా అధిక ద్రవ్యోల్భనం, వేగంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో టెక్ కంపెనీలు ఈ చర్యలు తీసుకుంటున్నాయి.
ఆన్ లైన్ వ్యాపారం పడిపోవడంతో పాటు, స్థూల ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న పోటీ, యాడ్స్ సిగ్నల్ లాస్ కారణంగా మా ఆదాయం నేను ఊహించిన దాని కన్నా చాలా తక్కువగా ఉందని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన ఉద్యోగులకు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగుల తొలగింపుపై నేను తప్పు చేశారు.. దానికి నేను బాధ్యత వహిస్తానని అన్నారు జుకర్ బర్గ్. ఉద్యోగుల తొలగింపు ప్యాకేజీలో భాగంగా ప్రతీ సంవత్సరం సర్వీసుకు 16 వారాల, ఏడాదికి రెండు అదనపు వారాలు బేస్ పేతో పాటు మిగిలిన అన్ని చెల్లింపును సమయానికి చెల్లిస్తామని మెటా తెలిపింది. ఫేస్ బుక్ పేరెంట్ మెటా ఈ వారం పెద్దస్థాయిలో ఉద్యోగులను తొలగించనుంది. ఉద్యోగులు ఆరు నెలల పాటు హెల్త్ కేర్ ఖర్చులను పొందనున్నట్లు తెలిపింది.