NTV Telugu Site icon

Meta: ఫ్రీ ఫుడ్ ఇక లేదు.. మెటా నిర్ణయంపై ఉద్యోగుల అసంతృప్తి..

Meta

Meta

Meta: ఆర్థికమాంద్యం భయాలు, కంపెనీల ఆదాయాలు తగ్గడంతో పలు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు అయిన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ట్విట్టర్ ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉంటే పలు కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలను తగ్గిస్తున్నాయి.

Read Also: GT vs PBKS: ఓవైపు వికెట్లు.. మరోవైపు పరుగులు.. నెట్టుకొస్తున్న పంజాబ్

ఇదిలా ఉంటే ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగులకు అందించే ఫ్రీ ఫుడ్ అండ్ స్నాక్స్ లను పరిమితం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆఫీసుల్లో ఇచ్చే అనేక ప్రోత్సహకాలనను తగ్గించినట్లు తెలిసింది. అయితే దీనిపై మెటా ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కాఫెటేరియాల్లో స్నాక్స్, సెరెల్స్, ఇతర ఫ్రీ ఫుడ్ తొలగించడం వంటి వాటిపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు.

ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో గతేడాది కంపెనీ ఏకంగా 11,000 మందిని తొలగించింది. ఈ ఏడాది మార్చిలో మరో 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఫ్రీ ఫుడ్ తో పాటు ఫ్రీ లాండ్రీ, డ్రైక్లీనింగ్ వంటి ఇతర సౌకర్యాల్లో కూడా కోతలు విధిస్తోంది. మరో వైపు ఉద్యోగులకు ఆఫీసులకు రమ్మని చెబుతోంది. వర్క్ ఫ్రం హోం చేసేవారి కన్నా ఆఫీసుల్లో పనిచేసేఉద్యోగులు మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇప్పటికే గూగుల్, సేల్స్ ఫోర్స్ వంటి ఇతర కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ఫ్రీ ఫుడ్ వంటి సౌకర్యాలను తొలగించింది.