ప్రపంచంలో అందరు ఒకేలా ఉండరు.. ఒకొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొంతమంది అందరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు.. ఇంకొంత మంది అందరిలా మనమెందుకు ఆలోచించాలని కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు. కొన్నిసార్లు వారు ఫెయిల్ అవుతారు.. మరికొన్నిసార్లు అలాంటివారే ఇంకొంతమందికి ఆదర్శంగా నిలుస్తారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి రెండో కోవకు చెందుతాడు అనే అనాలి. సాధారణంగా ఎవరైనా పోర్న్ సైట్ లో పాఠాలు చెప్తారని అనుకుంటారా..? అసలు ఆ ఆలోచన ఎవరికైనా వస్తుందా..? అని అనుకుంటారు. కానీ డిఫెరెంట్ గా ఆలోచించిన చాంగ్‌షూ మాత్రం పోర్న్ హబ్ నే తన స్కూల్ గా అనుకున్నాడు. పోర్న్ వీడియోలు ప్లే అవుతున్న చోటే తన మ్యాథ్స్ క్లాసు వీడియోలు పోస్ట్ చేశాడు.
సరే పిచ్చి పట్టి అతను పోస్ట్ చేశాడు.. పోర్న్ సైట్ లో ఎవడు మ్యాథ్స్ వీడియోస్ చూస్తాడు అనుకుంటే పొరబడినట్లే.. రోజూ చాంగ్‌షూ మ్యాథ్స్ క్లాస్ కి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. దీంతో మనోడు పోర్న్ హబ్ తో పటు మిగతా అశ్లీల సైటలన్నింటిలోను అకౌంట్ ని ఓపెన్ చేసి మ్యాథ్స్ క్లాసులు తీసేస్తున్నాడు. ఈ క్లాసుల ద్వారా అతను సంవత్సరానికి రూ.2 కోట్లకు పైనే సంపాదిస్తున్నాడు.
దీనిపై చాంగ్‌షూ స్పందిస్తూ.. తైవాన్ లో అద్భుతంగా మ్యాథ్స్ నేర్పించే ఒక టీచర్ ఉన్నాడని ప్రపంచం మొత్తం తెలియడానికే ఈ విధంగా చేశాను. పోర్న్ హబ్ లో మ్యాథ్స్ క్లాసులకు వచ్చిన సాప్న్దన మరెక్కడా రాలేదు.. అందుకే నేను ఇంకా ఎదగాలని మిగతా అశ్లీల సైటలన్నింటిలోను అకౌంట్ తెరిచి క్లాసులు మొదలుపెట్టాను అంటూ వివరించాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా పోర్న్ సైట్ కి వెళ్లి మరీ మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు అంటే సాహసమనే చెప్పాలని నెటిజన్లు కామెంటు పెడుతున్నారు.