CR Rao: గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CR Rao: గణిత శాస్త్రవేత్త సీఆర్ రావుగా పేరుగాంచిన కల్యంపుడి రాధాకృష్ణ రావు (CR Rao) కన్నుమూశారు. భారత్‌కు చెందిన అమెరికా గణిత శాస్త్రవేత్త అయిన సీఆర్ రావు ప్రపంచంలోనే ప్రఖ్యాత సంఖ్యాశాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. 1968లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్, 2001లో పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. స్టాటిస్‌టిక్స్ రంగంలో నోబెల్ బహుమతిగా భావించబడే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్‌టిక్స్‌ను ఆయన ఈ ఏడాది గెలుచుకున్నారు. ఆధునిక గణిత శాస్త్రంలో సీఆర్ రావును ప్రావీణ్యుడిగా పేర్కంటారు. మల్టీవేరియేట్ విశ్లేషణ, శాంపిల్ సర్వే థియరీ, బయోమెట్రి లాంటి అంశాల్లో సీఆర్ రావు విస్తృతంగా పనిచేశారు. కర్నాటకలోని హడగలిలో ఓ తెలుగు కుటుంబంలో 1920 సెప్టెంబరు 10న సీఆర్ రావు జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడురు, నూజివీడు, నందిగామ, విశాఖల్లో ఆయన పాఠశాల స్థాయి విద్యాభ్యాసం కొనసాగించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంస్సీ మ్యాథమెటిక్స్‌లో పట్టా పొందారు. 1943లో కల్‌కత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ స్టాటిస్‌టిక్స్ పూర్తి చేశారు. ఆ తరువాత గణిత శాస్త్రంలో పీహెచ్‌డీ కోసం ఆయన బ్రిటన్ వెళ్లారు. సర్ రోనాల్డ్ ఏ వద్ద పీహెచ్‌డీ పూర్తి చేశారు. తొలుత ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్‌టిట్యూట్, క్యాంబ్రిడ్జ్ ఆంథ్రోపోలాజికల్ మ్యూజియంలో పనిచేశారు.
Also Read
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్ అయ్యారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. హైదరాబాద్‌లోని సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వ్యవస్థాపకులైన ఆయన సేవలు కేవలం స్టాటిస్టికల్ రంగానికే కాకుండా ఎకనమిక్స్, జెనెటిక్స్, ఆంత్రోపాలజీ తదితర రంగాలకూ విశేషంగా ఉపయోగపడినట్లు ఇటీవల ఒక వెబినార్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సీవీ రావు 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. ఇప్పటివరకూ 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారం అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సొసైటీకి అధ్యక్షుడిగా పని చేశారు. స్టాటిస్‌టిక్ టెక్నిక్‌లను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్రామెర్-రావు ఇనిక్వాలిటీ, రావు-బ్లాక్‌వెల్ థియరీ లాంటి టెక్నిక్‌లను సీఆర్ రావు డెవలప్ చేశారు.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!