The Sun: సూర్యుడి ఉపరితలంపై భారీ రంధ్రం.. భూమికి ప్రమాదమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive ‘Hole’ Spotted on Sun’s Surface: సౌరకుటుంబానికి మూలం సూర్యుడు. ఈ గ్రహాలను తన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సూర్యుడిపై భారీగా ఏర్పడిన నల్లటి ప్రాంతాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమి కన్నా 20 రెట్లు పెద్దగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి భారీ బ్లాక్ స్పాట్లను ‘‘కరోనల్ హోల్’’గా పిలుస్తారు. భారీ సూర్యుడి వెలుగుల మధ్య నల్లటి ప్రాంతం ఓ రంధ్రంగా కనిపిస్తుంటుందని అందుకనే వీటిని కరోనాల్ హోల్ గా వ్యవహరిస్తుంటారు. సూర్యుని దక్షిణ ధ్రువానికి సమీపంలో మార్చి 23న నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) కరోనల్ హోల్‌ను కనుగొంది.
ఇలాంటి బ్లాక్ స్పాట్ల నుంచి అయస్కాంత తుఫానులు భూమి వైపు దూసుకు వస్తుంటాయి. ఈ బ్లాక్ స్పాట్ల నుంచి సౌర తుఫానులు దూసుకు వస్తుంటాయి. ప్రస్తుతం ఏర్పడిన కరోనల్ హోల్ చాలా పెద్దది. దాదాపు 300,000 నుండి 400,000 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే దాదాపు 20-30 భూమిలతో సమానం. జియోమ్యాగ్నటిక్ తుఫానులను జీ1 నుంచి జీ5 వరకు వర్గీకరించారు. ఇందులో జీ5 అత్యంత శక్తివంతమైనది.
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ఈ బ్లాక్ స్పాట్స్ ఎలా ఏర్పడుతాయి..?
ఆల్ట్రావయోలెట్, ఎక్స్ కిరణాలు కలిగి భగభగ మండే సూర్యుడి ఉపరితలంపై బ్లాక్ గా ఉండే ప్రాంతాలను కరోనల్ హెల్స్ అంటారు. చుట్టుపక్కల ఉండే ప్లాస్మా కన్నా ఇది చల్లగా, తక్కువ సాంద్రత కలిగిన ప్రాంతాలు. ఈ కరోనాల్ హోల్స్ సూర్యుడిపై ఎప్పుడైనా, ఎక్కడైనా ఏర్పడవచ్చు. అయితే సూర్యుడి ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద చాలా తీవ్రతతో స్థిరంగా ఉంటాయి.

భూమిపై ఎలా ప్రభావం చూపిస్తాయి..?
ఈ కరోనల్ హోల్స్ నుంచి ఆవేశిత కణాలు అయస్కాంత తుఫాన్ల రూపంలో భూమి వైపు దూసుకొస్తుంటాయి. తాజాగా ఏర్పడిన రంధ్ర వద్ద నుంచి వచ్చే తుఫానులు శుక్రవారం భూమిని తాకనున్నాయి. గంటలకు 2.9 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తున్నాయి. ఈ అయస్కాంత తుఫానులు భూమిపై పెద్దగా ప్రభావం చూపించవు కానీ భూమి చుట్టు తిరుగుతున్న కమ్యూనికేషన్ శాటిలైట్లను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. జీపీఎస్, మొబైల్ ఫోన్లపై ప్రభావం చూపిస్తుంది. భూమికి సహజంగా ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం, సూర్యుడి నుంచి వచ్చే అయస్కాంత తుఫానులను అడ్డుకుంటుంది.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..