Site icon NTV Telugu

Earthquake: రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

Earthquak

Earthquak

రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపాలు సంభవించాయి. రష్యాలో తీవ్రత 7.8గా.. ఇండోనేషియాలో 6.1గా తీవ్రత నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున రష్యాలోని కమ్చట్కాలో భూ కంపం సంభవించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ భూకంపం 10 కి.మీ లోతులో నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తొలుత 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా.. రెండోసారి 5.8 తీవ్రతతో నమోదైనట్లు పేర్కొంది. యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ సునామీ హెచ్చరికను జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Mahabubnagar: అమెరికాలో పాలమూరు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు..

ఇక ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లోని శుక్రవారం తెల్లవారుజాము సమయంలో 28 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో బిజీగా సీఎం రేవంత్.. రాష్ట్రంలో పెట్టుబడులే టార్గెట్!

ఇక టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో రష్యా ప్రజలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి నష్టం జరిగినట్లుగా సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక జపాన్‌కు ఉత్తరాన ఉన్న కురిల్ దీవుల వరకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే అలాస్కాలోని కొన్ని ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం విరమించుకున్నారు.

ఇక భూకంపం సంభవించగానే ఇళ్లల్లోనే ఫర్నిచర్, లైట్ ఫిక్చర్‌లు ఊగుతూ కనిపించాయి. అలాగే పార్కు చేసిన కార్లు కూడా జంప్ చేస్తూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version