Site icon NTV Telugu

Marco Rubio: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది ట్రంపే.. శాంతి అధ్యక్షుడిగా మార్కో రూబియో బిరుదు

Marcorubio

Marcorubio

భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది తానేనంటూ పదే పదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. దీన్ని భారతప్రభుత్వం పలుమార్లు ఖండించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. అయినా కూడా ట్రంప్ ఏ దేశ పర్యటనకు వెళ్లినా.. ఇదే మాట చెబుతున్నారు. తాజాగా ట్రంప్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా జతయ్యారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu: సీఎం స్టాలిన్‌ సంచలన నిర్ణయం.. జాతీయ విద్యా విధానానికి స్వస్తి

భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది ట్రంపేనని.. కాల్పుల విరమణ చర్చల్లో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొందని తెలిపారు. ట్రంప్ శాంతి అధ్యక్షుడిగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. తమ ప్రమేయం లేకుండా కాల్పుల విరమణ జరిగేదా? అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఈసీపై రాహుల్‌గాంధీ యుద్ధం.. బెంగళూరులో ధర్నా

రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించిన ఘనత ట్రంప్‌కే దక్కుతుందన్నారు. దేశాల మధ్య సంధిని విజయవంతంగా అమలు చేసినందుకు  ట్రంప్‌ను ‘శాంతి అధ్యక్షుడు’ అని పిలిచారు. ట్రంప్ ప్రోద్బలంతోనే అంతర్జాతీయంగా శాంతి నెలకొందన్నారు. ఇందులో కంబోడియా-థాయిలాండ్, అజర్‌బైజాన్-అర్మేనియా ఘర్షణలు, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో- రువాండా మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తతలు తగ్గాయన్నారు. యుద్ధాలను ఆపేందుకు గణనీయమైన సమయాన్ని కేటాయించినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై దృష్టి పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Cyber Fraud: వృద్ధుడిపై వలపు వల.. రూ.9 కోట్లు సమర్పయామి

Exit mobile version