Man Tries To Eat Noodles In Extreme Cold: వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు.. వేడివేడి ఆహారాలు తినాలని అందరికీ ఉంటుంది. మరీ ముఖ్యంగా.. ఆరు బయట ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, వేడివేడి ఫుట్ ఐటమ్స్ తీసుకుంటే, అందులో వచ్చే కిక్కే వేరప్పా! సరిగ్గా అలాంటి అనుభూతినే పొందాలని ఓ వ్యక్తి అనుకున్నాడు. మంచు కురుస్తున్న ప్రదేశానికి వెళ్లి.. వేడివేడి నూడుల్స్ తినాలని భావించాడు. కానీ.. ఇంటి నుంచిన బయటకు అడుగుపెట్టడమే ఆలస్యం, ఆ మంచులో అతనికి ఊహించని పరిణామం ఎదురైంది. నూడుల్స్‌తో పాటు అతడు కూడా దాదాపు గడ్డకట్టుకుపోయే పరిస్థితిని చవిచూడాల్సి వచ్చింది.
Tamannaah Beauty Secret : తన అందాల రహస్యం చెప్పిన తమన్నా
ఆ వివరాల్లోకి వెళ్తే.. కెనడాకు చెందిన జేక్ ఫిషర్ అనే వ్యక్తి, అక్కడి చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నూడుల్స్ తినాలని అనుకున్నాడు. ఇంట్లో వేడివేడిగా నూడుల్స్ సిద్ధం చేసుకొని, స్వెటర్ ధరించి ఆరుబయట కాలుమోపాడు. ఇక పొగలు కక్కుతున్న ఆ నూడుల్స్‌ని తినేందుకు స్పూన్ పెట్టి పైకెత్తాడు. అంతే.. అది గాల్లోనే గడ్డకట్టుకుపోయింది. కనురెప్పపాటులోనే స్పూన్‌తో పాటు నూడుల్స్ కూడా కదలకుండా, గాల్లో అలాగే ఉండిపోయాయి. కేవలం ఆ నూడుల్సే కాదు.. జేక్ జుట్టు, గడ్డం కూడా గడ్డకట్టుకుపోయాయి. ఈ పరిణామంతో ఖంగుతిన్న జేక్.. దీన్నంతా తన కెమెరాలో బంధించాడు. వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. డిసెంబర్ 28వ తేదీన ఈ వీడియోని అతడు పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది.
Air India Urinating Case: ఫోన్ స్విచ్చాఫ్.. నిందితుడు మిశ్రా ఎలా చిక్కాడంటే?
ఈ వీడియోపై నెటిజన్లు సైతం కామెడీ కామెంట్లు చేస్తున్నారు. ‘అంత మంచు కురుస్తుందని తెలిసి, ఎవరు నిన్ను బయటికి వెళ్లమన్నాడు’ అంటూ ఒక నెటిజన్లు సెటైరికల్‌గా కామెంట్ చేశాడు. మరొకరైతే.. గడ్డకట్టిన ఆ వ్యక్తి ‘అక్వామ్యాన్’లాగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంకొకరైతే.. ఈ జేక్ నార్నియా ప్రాంతం నుంచి వచ్చాడంటూ కామెంట్ పెట్టాడు. నూడుల్స్ తినాలనుకున్న వ్యక్తే నూడుల్స్‌లా మారాడంటూ మరికొందరు సరదా కామెంట్లు చేసుకుంటున్నారు.
