Parasites Eat Eye: కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్ర పోతున్నారా..? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. చిన్న పొరపాటు కారణంగా కన్నును కోల్పోయే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒక వ్యక్తి కాంటాక్ట్ లెన్స్ ను ధరించే నిద్రపోయాడు. అయితే అరుదైన పరాన్నజీవి అతని కంటి మాంసాన్ని తినేసింది. ఫలితంగా అతను కంటి చూపును కోల్పోయాడు.
Read Also: Shiv Sena: శివసేన పేరు, పార్టీ గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానివే.. స్పష్టం చేసిన ఈసీ
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల మైక్ క్రుమ్‌హోల్జ్ తరుచుగా చేసిన విధంగా కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్రపోయాడు. గత ఏడేళ్లుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతున్న మైక్ కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల ఇన్ఫెక్షన్, పింక్ ఐ రావడం కొత్తేం కాదు. అయితే ఈ సారి మాత్రం ఆయన ఏకంగా కంటినే కోల్పోయాడు. అతని కుడి కంటిలో అకాంతమీబా కెరాటిటిస్ ఉన్నట్లు నిర్థారణ అయింది. ఫిబ్రవరి 7న తనకు జరిగిన ఘటనను వివరించాడు మైక్.
నేను నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత అలెర్జీ ఉన్నట్లు, పింక్ ఐ ఉన్నట్లు కనిపించిందని.. అయితే కంటి వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత అత్యంత అరుదైన అకాంతమీబా కెరాటిటిస్ అనే పరాన్న జీవి కంటిలో ఉన్నట్లు నిర్థారణ అయిందని వెల్లడించారు. కాంటాక్ట్ లెన్స్ తో నిద్ర పోవద్దని, స్నానం చేయవద్దని మైక్ క్రుమ్ హోల్జ్ విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఒక కంటి చూపును కోల్పోయాడు.
