Site icon NTV Telugu

Misbehave: దేశ అధ్యక్షురాలిపై చేయి వేసి.. ముద్దు పెట్టబోయిన ఓ వ్యక్తి.. అడ్డుకున్న సిబ్బంది

Untitled Design (16)

Untitled Design (16)

మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్ బామ్ తో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వ్యక్తి అధ్యక్షురాలి దగ్గరికి వరకు ఎలా వచ్చాడంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ పలువులు విమర్శిస్తున్నారు.

Read Also: Viral Dance: ఎల్లమ్మ పాటకు పొట్టు పొట్టు ఎగిరిన వృద్ధురాలు.. షాకైన జనాలు..

మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌తో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ప్రజలతో ఆమె సంభాషిస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను కౌగిలించుకొని మెడపై ముద్దుపెట్టబోయాడు. అయితే అధ్యక్షురాలు క్లాడియా మాత్రం.. అతడి చేతులను తనపై నుంచి తొలగించింది. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. . అధ్యక్షురాలికి అంత దగ్గరగా వచ్చే వరకూ ఆమె సెక్యూరిటీ స్పందించలేదు. ఈ ఘటన కలకలం రేపడంతో మెక్సికో తొలి మహిళా ప్రధాని అయిన క్లాడియా భద్రతపై పలువురు విమర్శిస్తున్నారు. ఒక దేశాధ్యక్షురాలికే సరైన భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version