NTV Telugu Site icon

ప్రపంచంలోనే పొడవైన సైకిల్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు

కొందరు వ్యక్తులకు సరికొత్త ఆవిష్కరణలు చేయడమంటే చాలా ఇష్టం. అలాంటి వారు ఎవరూ చేయని ఆవిష్కరణలు చేసి వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ఆడమ్‌ జ్డానోవిచ్‌ అనే వ్యక్తి కూడా ఇలాగే ఆలోచించి ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌ను రూపొందించాడు. అయితే ఈ సైకిల్‌ను అతడు తయారుచేసిన పద్ధతి తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే అతడు వాడి పారేసిన వస్తువులతో ఈ సైకిల్ తయారుచేయడం విశేషం.

ఆడమ్‌ జ్డానోవిచ్‌ అనే వ్యక్తి రీసైక్లింగ్ వస్తువులతో అతి పొడవైన సైకిల్‌ని రూపొందించాడు. ఈ సైకిల్‌ 24 అడుగుల 3 అంగుళాలు ఉంది. అతడు ఈ సైకిల్‌ను రైడింగ్ చేస్తున్న దృశ్యాన్ని గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయితే ఆడమ్‌ జ్డానోవిచ్‌ ఏ దేశానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రస్తావించలేదు. ఈ సైకిల్‌ను చూసిన నెటిజన్లు ఆడమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తనకెప్పడూ పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయడమే ఇష్టమని, తన ఆలోచనలు ఎప్పడూ పెద్దస్థాయిలోనే ఉంటాయని పొడవైన సైకిల్ సృష్టికర్త ఆడమ్ కామెంట్ చేశాడు.

https://www.instagram.com/p/CYzZFByKLml/