Site icon NTV Telugu

Ghana: ఘనా పార్లమెంట్‌‌ దగ్గర బీభత్సం.. ఖరీదైన కార్లు ధ్వంసం.. ఒకరు అరెస్ట్

Ghana

Ghana

ఘనా పార్లమెంటు ఆవరణలో బుధవారం ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పార్కు చేసిన ఖరీదైన వాహనాలను ఇష్టానురీతిగా ధ్వంసం చేశాడు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతంలో బీభత్సం సృష్టించాడు. దాదాపు ఏడు కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Nallamala Forest: నల్లమల ఫారెస్ట్‌లో తప్పిపోయిన 15 మంది భక్తులు.. డయల్‌ 100కు కాల్‌..

డిసెంబర్ 18, 2024 బుధవారం ఘనా పార్లమెంట్ ఆవరణలో వాహనాలు పార్కు చేసి ఉన్నాయి. అయితే తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి ఆగి ఉన్న ఏడు వాహనాలను లక్ష్యంగా చేసుకుని విండ్‌స్క్రీన్‌లు, కిటికీలను పగులగొట్టాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అధికారులు కలవరపడ్డారు. అయితే నిందితుడు మానసిక క్షోభకు గురవుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు పైకి చూస్తూ అరవడం కనిపించింది. పదే పదే “నాన్న వారిని చంపవద్దు. నాన్న నా వాళ్ళని నాశనం చేయకు” అంటూ అరుపుల అరిచాడు. “తండ్రి వారిపై దయ చూపండి. డాడీ, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు … ఇది మీ స్వంత మంచి కోసం.” అంటూ కేకలు వేశాడు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్‌పై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన ఏం చేయలేదు. అసలేం జరిగిందో మీడియాకు వివరించలేదు.

 

 

Exit mobile version