Site icon NTV Telugu

ఆఫ్ఘన్‌ పరిస్థితిపై మలాలా ఆవేదన

ఆఫ్ఘన్‌లో పరిస్థితులపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు కాల్పులు జరిపి… 9 ఏళ్లు పూర్తవుతున్నా… ఓ బుల్లెట్‌ గాయం నుంచి కోలుకోలేకపోతున్నానని మలాలా తెలిపారు. గత 40 సంవత్సరాలుగా దేశ ప్రజలు… లక్షల కొద్దీ బుల్లెట్లను ఎదుర్కొంటూనే ఉన్నారని వెల్లడించారు. ఆఫ్ఘన్‌లో తొలి ప్రావిన్స్‌ను ఆక్రమించుకున్న సమయంలో మలాలాకు సర్జరీ జరిగింది. ఆ ఆపరేషన్‌ నుంచి ఇటీవలే కోలుకున్న ఆమె.. ప్రస్తుత ఆఫ్ఘన్‌ పరిస్థితులపై స్పందించారు. తాలిబన్ల చర్యలతో కారణంగా తాను అనుభవిస్తున్న గాయాలతో… పడుతున్న బాధలను పంచుకున్నారు.

తాలిబన్లు… ఆఫ్ఘనిస్తాన్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటున్న సమయంలో… మలాలాకు బోస్టన్‌లో ఆరో శస్త్రచికిత్స జరిగింది. 2012 అక్టోబరులో…. పాకిస్థానీ తాలిబన్లు స్కూల్‌ బస్సులోకి చొరబడి… మలాలా ఎడమ కణతిపై తుపాకీతో కాల్చారు. ఆ ఒక్క బుల్లెట్‌… ఆమె ఎడమ కంటిని, మెదడును తినేసింది. ముఖ నరాలను దెబ్బతీసింది. చెవిని, దవడను విరగ్గొట్టింది. సమయానికి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెషావర్‌ డాక్టర్లు… ఎడమ కణతి వద్ద పుర్రెలో కొంత భాగాన్ని తొలగించారు. దాన్ని వల్లే మలాలా ప్రాణాలు నిలిచాయి. ఆమె కళ్లు తెరిచే సమయానికి… క్వీన్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో ఉన్నారు. అంతా ఇంగ్లీష్‌ మాట్లాడుతుండటంతో… ఆమెకు ఏమీ అర్థం కాలేదు. నాన్న ఎక్కడ ఉన్నారు? చికిత్సకు డబ్బులు ఎవరు కడుతున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు మలాలాను సతమతం చేశాయి. అయితే మాట్లాడలేకపోయింది. సరిగా చూడలేకపోయింది. కొద్ది రోజుల తర్వాత అద్దంలో చూసుకుని షాక్‌ అయింది. ఒక కన్ను నల్లగా, సగం గుండుతో కన్పించడంతో…తాలిబన్లు గుండు గీయించారని అనుకుంది. కానీ సర్జరీ కోసం డాక్టర్లు షేవ్‌ చేశారన్న విషయం ఆలస్యంగా తెలుసుకుంది. పాకిస్థాన్‌లో ఆపరేషన్‌ చేసినప్పుడు పుర్రె ఎముకలో కొంతభాగాన్ని తీసి… మలాలా కడుపులో దాచారు. సర్జరీ కోసం… దాన్ని తలలో అమర్చడానికే డాక్టర్లు అలా చేశారు. అయితే యూకే వైద్యులు పుర్రె ఎముక స్థానంలో… టైటానియం ప్లేట్‌ను అమర్చారు. కడుపులో ఉన్న ఎముక భాగాన్ని బయటకు తీశారు. ఇప్పటికీ ఆ భాగం ఇంట్లో బుక్‌ షెల్ఫ్‌లో పెట్టినట్లు మలాలా వెల్లడించారు.

Exit mobile version