మహారాజా రంజిత్ సింగ్ 180 వ జన్మదినం సందర్భంగా లాహోర్ పోర్టులో పాక్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ ప్రావిన్స్‌ను పరిపాలించారు. లాహోర్ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఆయన పరిపాలన కాలంలో లాహోర్ అభివృద్ది జరిగింది. అయితే, మంగళవారం రోజున పాక్ అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు పోర్టులో ఏర్పాటు చేసిన మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోర్టు అధికారులు నిందితుల్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ విగ్రహంపై దాడి జరగడం ఇది మూడోసారి. జమ్మూకాశ్మీర్‌కు సంబందించి ప్రత్యేక అధికారాలను కేంద్రం రద్దు చేసిన సమయంలో ఒకసారి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయగా, 2020 డిసెంబర్‌లో మరోసారి విగ్రహంపై దాడికి పాల్పడ్డారు.
Read: తాలిబన్ల మరో సంచలన నిర్ణయం: అధికారులకు క్షమాభిక్ష…
