Earthquake: ఓషియానియా దేశం అయిన ఫిజీలో భారీ భూకంపం సంభవించింది. శనివారం దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్వీప దేశం అయిన ఫిజీలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతగా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
Read Also: Sharad Pawar: శరద్ పవార్‌ని చంపేస్తా.. బెదిరించింది బీజేపీ కార్యకర్త
ఓషియానియా దేశాలు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూకంపాల ఎక్కువగా సంభవిస్తుంటాయి. సముద్రం అడుగు భాగంలో అగ్నిపర్వతాలు బద్ధలవడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఫిజీతో పాటు టోంగా, న్యూజీలాండ్, వనౌతు, హవాయ్ వంటి ప్రాంతాలు భూకంపాలు ఎక్కువగా సంభవించే ‘‘ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’’ జోన్ లో ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంలో తరుచుగా అగ్నిపర్వతాలు బద్ధలవ్వడం, భూకంపాలు రావడం చూస్తుంటాం. ఈ ప్రాంతంలో సముద్రపు అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఒక పలకను మరో పలక ఢీకొట్టడం వల్ల భారీగా శక్తి విడుదలై భూకంపాలు వస్తుంటాయి. కొన్ని సార్లు సునామీలు కూడా సంభవిస్తుంటాయి.