Site icon NTV Telugu

Tarique Rahman: బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఓం బిర్లా

Speaker

Speaker

బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు గాను 212 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక రేపటి ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లడం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరుకానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: AP Weaver Welfare: నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్..

తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ యూనస్.. 13 దేశాల నుంచి ప్రభుత్వాధినేతలను ఆహ్వానించారు. భారతదేశం, చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ నేతలను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఇక తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్‌లోని సదరన్ ప్లాజాలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: IND vs PAK: పాకిస్తాన్ పై ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్.. యువరాజ్ సింగ్‌ రికార్డ్ బ్రేక్

చాలా రోజుల నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తారిక్ రెహమాన్ బాధ్యతలు చేపట్టాకైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో చూడాలి. హిందువులే లక్ష్యంగా మారణహోమం జరుగుతోంది. దీనికి అడ్డుగట్ట పడాల్సిన అవసరం ఉంది.

Exit mobile version