Site icon NTV Telugu

జర్మనీలో మరోసారి లాక్‌డౌన్‌..

కరోనా మహమ్మారి జర్మనీలో విజృంభిస్తోంది. ఇప్పటికే జర్మనీలో కోవిడ్‌ తీవ్ర రూపం దాల్చింది. దీంతో రోజుకు 76 వేల పై చిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ జర్మనీలో ప్రవేశించింది కూడా. దీంతో ప్రజల్లో మరింత భయం నెలకొంది.

తాజా కేసులతో అక్కడి ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోవడంతో ఏకంగా వైమానిక దళాన్ని కూడా జర్మనీ ప్రభుత్వం రంగంలోకి దింపింది. అంతేకాకుండా కరోనా కట్టడికి షరతులతో కూడిన లాక్‌డౌన్‌ను కూడా విధిస్తున్నట్లు జర్మనీ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోని వారు బయట తిరగవద్దని ఆదేశాలు జారీ చేసింది. కానీ.. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది జర్మనీ ప్రభుత్వం.

Exit mobile version