lions rates cheaper than buffaloes rates In Pakistan: పాకిస్తాన్ దేశాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు విలాస వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే మానేశాయి. దీంతో పాటు పెట్రోల్ ధరలు పెరిగాయి. గ్యాస్, ఇంధన కొరతతో విద్యుత్ సమస్యలు తెలత్తుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక సమస్యలు జంతువులపై కూడా పడ్డాయి. ఇటీవల లాహోర్ సఫారీ జూలో ఆఫ్రికన్ సింహాలను అమ్మేందుకు జూ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఒక్కో సింహానికి పాక్ కరెన్సీలో రూ. 1,50,000 విక్రయించడానికి సిద్ధం అయింది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే రూ. 50,000 అన్నమాట. మొత్తం జూలోని 12 సింహాలను విక్రయించాలని యోచిస్తోంది.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో గేదెల ధరలు సింహాల ధరల కన్నా ఎక్కువగా ఉన్నాయని.. గేదెల కన్నా చీప్ ధరలకు సింహాలు లభిస్తున్నాయంటూ అక్కడి మీడియా వార్త కథనాలు ప్రచురిస్తోంది. పాకిస్తాన్ లో ఒక గేదె రూ.3,50,000 నుంచి దాని రకాన్ని బట్టి 1 మిలియన్ వరకు ఉన్నాయి. దీంతో పోలిస్తే సింహాల ధరలు చాలా తక్కువ. ఇండియన్ రూపాయల్లో ఒక్కో గేదె ధర రూ. 1.17 లక్షల నుంచి రూ.3.35 లక్షలకు వరకు ఉంది.
ప్రస్తుతం జూలో జంతువుల నిర్వహణకు అయ్యే ఖర్చులు, వాటి ఆహారానికి, అవసరాలు తీర్చడానికి ఖర్చులు పెంటే అంత స్తోమత అక్కడి ప్రభుత్వానికి, జూ యాజమాన్యానికి లేని కారణంగానే సింహాలను అమ్మాలని చూస్తున్నారు. సింహాల నిర్వహణ కష్టంతో పాటు ఖరీదుతో కూడుకున్నదని.. సింహాలు రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది కిలోల మాంసాన్ని తింటాయని.. దీంతో వీటిని భరించలేకుండా ఉన్నామని జూ యాజమాన్యం చెబుతోంది. దీంతో వీటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును జూ నిర్వహణకు ఉపయోగించనున్నారు. గతేడాది ఇదే సఫారీ జంతు ప్రదర్శన శాలలో స్థలం సరిపోవడం లేదనే సాకుతో 14 సింహాలను విక్రయించారు.