Pakistan: పాకిస్తాన్‌ని భయపెడుతున్న భారీ వర్షాలు.. 41 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. గత మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 41 మంది మరణించారు. దేశ నైరుతి ప్రాంతంలో పాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారని అధికారులు సోమవారం వెల్లడించారు. తూర్పు పంజాబ్ ప్రావిన్సులో గోధుమ పండిస్తున్న రైతులపై పిడుగులు పడటంతో పాటు వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో చాలా మంది మరణించారు. కేవలం పిడుగుల కారణంగానే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాక్ ప్రభుత్వం సూచించింది. కొండచరియలు విరిగి పడటంతో పాటు ఆకస్మిక వరదల హెచ్చరిలకు జారీ చేసింది.
Read Also: SRH vs RCB: భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీ బౌలర్లపై ఊచకోత
Also Read
పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ పంజాబ్‌లో శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో పిడుగుపాటు కారణంగా 21 మరణాలు సంభవించాయి. ప్రావిన్సులతో సమన్వయం చేసుకోవాలని పాక్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం ఆదేశించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పిడుగుపాటు వల్ల 8 మంది మరణించారు. దాదాపుగా 25 జిల్లాలు వరదలకు ప్రభావితమయ్యాయి. దక్షిణ సింధ్ ప్రావిన్సులో వరదల కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి నలుగురు మరణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో నలుగురు పిల్లలతో సహా 8 మంది మరణించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!