టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లిబియా ఆర్మీ చీఫ్ అలీ కన్నుమూశారు. లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ అలీ మరణవార్తపై ప్రధాన మంత్రి అబ్దుల్‌హమీద్ ద్బీబా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాలా బాధ కలిగిందని ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. టర్కీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొంది. లిబియాకు గొప్ప నష్టంగా అభివర్ణించారు. ఆర్మీ చీఫ్‌తో పాటు నలుగురు అధికారులు చనిపోయినట్లు ధృవీకరించారు.
లిబియా సైనికాధికారి, మరో నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ జెట్ విమానం మంగళవారం టర్కీ రాజధాని అంకారా నుంయి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. అయితే విమానంలోని సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని లిబియా అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉన్నత స్థాయి రక్షణ చర్చల కోసం లిబియా ప్రతినిధి బృందం అంకారాలో ఉందని టర్కిష్ అధికారులు వెల్లడించారు.
