Site icon NTV Telugu

Labanon: లైవ్‌లో ఉండగా జర్నలిస్టుపై పడ్డ ఇజ్రాయెల్ క్షిపణి.. వీడియో వైరల్

Labanontvjourlist

Labanontvjourlist

లెబనాన్‌పై సోమవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. దాదాపు 300 రాకెట్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 557 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు, మహిళలు అధికంగా ఉన్నారు. అయితే తాజాగా ఒక జర్నలిస్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Delta Corp Share Price: ఒక్క వార్త కారణంగా రాకెట్లుగా మారిన గేమింగ్ కంపెనీ షేర్లు!

హిజ్బుల్లాకు మద్దతుదారుడైన లెబనాన్ జర్నలిస్ట్ ఫాడి బౌదయా టీవీ లైవ్ ఇంటర్వ్యూలో ఉన్నాడు. తన ఇంటిలో ఉండి ఛానల్ లైవ్‌లో ఉన్నాడు. ఇంతలోనే ఇజ్రాయెల్ క్షిపణి తన ఇంటిపై పడింది. దీంతో భయాందోళనతో పెద్దగా అరుస్తూ బయటకు వెళ్లిపోయాడు. మొత్తానికి స్వల్ప గాయాలతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Prakash Raj: పవన్ కి ప్రకాష్ రాజ్ మరో కౌంటర్.. ఆ ఆనందమేంటో?

ఫాడి బౌదయా.. మిరయా ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌లో ఎడిటర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. క్షిపణి ఇంటిని తాకగానే అతడు బ్యాలెన్స్ కోల్పోవడం.. స్క్రీన్ విసిరివేయబడింది. ఈ ఘటనపై బౌదయా స్పందిస్తూ దేవునికి ధన్యవాదాలు చెప్పారు. క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై దేవుని ఆశీర్వాదాలు ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు.

ఇది కూడా చదవండి: Kodali Nani: దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు..

గత వారం లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ వారం సోమవారం ఇజ్రాయెల్ జరిపిన రాకెట్ల ప్రయోగంతో దాదాపు 557 మంది లెబనాన్ వాసులు మృత్యువాత పడ్డారు. ఇక లెబనాన్ పౌరులు ఇళ్లు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తమ టార్గెట్ పూర్తయ్యాక తిరిగి రావాలని వార్నింగ్ ఇచ్చింది. హిజ్బుల్లా నేతలు.. పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఈ హెచ్చరికలు జారీ చేసింది.

Exit mobile version