Site icon NTV Telugu

Largest Cosmic Explosion: విశ్వంలో అతిపెద్ద పేలుడు.. మాటలకందని విస్పోటనం

Largest Cosmic Explosion

Largest Cosmic Explosion

Largest Cosmic Explosion: ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చూడని అతిపెద్ద కాస్మిక్ పేలుడును కనుగొన్నారు. ఈ సంఘటన భూమికి 8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. ఈ పేలుడు దాదాపుగా 3 ఏళ్ల పాటు కొనసాగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనకు తెలిసిన సూపర్ నోవా విస్ఫోటనం కన్నా పది రెట్లు అధిక ప్రకాశవంతంగా ఉన్నట్లు వెల్లడించారు.

AT2021lwx అనే విశ్వ విస్ఫోటనాన్ని 2020లో కాలిఫోర్నియాలోని జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ మొదటిసారిగా గుర్తించింది. ఈ సదుపాయం ద్వారా రాత్రిపూట ఆకాశాన్ని స్కాన్ చేస్తారు. ఆస్టరాయిడ్స్, తోకచుక్కుల, సూపర్ నోవాలు ప్రయాణాలతో పాటు ఆకాశంలో సడన్ గా ఏర్పడే కాంతిని కూడా గుర్తిస్తుంది. ఆ తర్వాత హవాయిలోని ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్(ATLAS) ఈ సిగ్నల్స్ ని అందుకుంటుందని వెల్లడిస్తుంది.

Read Also: Gyanvapi mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. “కార్బన్ డేటింగ్‌”కి అనుమతి..

పరిశోధనకు నాయకత్వం వహించిన సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలోని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఫిలిప్ వైజ్‌మాన్ ప్రకారం.. ఈ సంఘటన ఎంత పెద్దదిర, ఎంతదూరంలో జరిగిందనే విషయాలను తెలుసుకున్నామని తెలిపారు. అయితే ఇది చాలా ప్రకాశవంతంగా ఉండటం వల్ల ఒక ఏడాది పాటు ఈ వివరాలను గుర్తించలేకపోయామన్నారు. ఈ పేలుడు గురించి తెలిసి అంతా షాక్ అయ్యామని అన్నారు. ఈ విస్పోటనం మాటలకు అందలేనంతగా ఉందని అన్నారు. దీని నుంచి వెలువడిన ఫైర్ బాల్ ఏకంగా మన సౌరవ్యవస్థ కన్నా 100 రెట్లు పెద్దదిగా ఉందని, సూర్యడితో పోలిస్తే రెండు ట్రిలియన్ రెట్లు ప్రకాశవంతంగా ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యుడితో పోలిస్తే వేల రెట్లు ఉన్న భారీ క్లౌడ్స్, బ్లాక్ హోల్స్ లో విలీనం అవుతున్నప్పుడు జరుగుతాయని శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది.

సూర్యుడు తన 10 బిలియన్ ఏళ్ల జీవితకాలంలో విడుదల చేసే శక్తి కన్నా 100 రెట్ల శక్తిని AT2021lwx మూడు సంవత్సరాలలో విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి సంఘటన బ్లాక్ హోల్ చేత ఒక నక్షత్రం నాశనం అయినప్పుడు ఉత్పత్తి అయ్యే కాంతి కంటే పేలుడు మూడు రెట్ల ప్రకాశవంతంగా ఉంటుందని, చాలా సూపర్ నోవాలు, టైడర్ డిస్ట్రప్షన్ ఈవెంట్స్(టీడీఈ)లు కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉంటాయని, అలాంటిది ఓ పేలుడు రెండు ఏళ్ల పాటు ప్రకాశవంతంగా ఉండటం అసాధారణమైన విషయం అని వైస్ మాన్ అన్నారు.

Exit mobile version