Korean Actress Park Soo Ryun Dies At 29 After Falling Down The Stairs: కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. పార్క్ సూ ర్యున్ అనే 29 ఏళ్ల నటి హఠాన్మరణం పొందింది. జూన్ 11వ తేదీన తన ఇంటికి వెళుతున్న సమయంలో, ఈ నటి మెట్లపై నుండి జారిపడింది. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు వైద్యం చేసేందుకు ప్రయత్నించారు కానీ, పార్క్ సూ శరీరం వైద్యానికి సహకరించలేదు. దీంతో.. వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఒక రోజు తర్వాత జెజు ద్వీపంలో పార్క్ సూ ప్రదర్శన చేయాల్సింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం చకచకా జరుగుతున్నాయి. ఇంతలోనే ఈ విషాదం జరిగింది. అతి తక్కువ వయసులోనే పార్క్ సూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. ఆమె కుటుంబంతో పాటు కొరియా సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు, అభిమానులు కూడా ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.
KS Bharat: సీఎం జగన్‌తో కేఎస్ భరత్ భేటీ.. ఏపీలో స్పోర్ట్స్ ప్రమోషన్ బాగుందన్న క్రికెటర్
కాగా.. ‘ఇల్ టెనోర్’తో పార్క్ సూ ర్యున్ 2018 సంవత్సరంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఫైండింగ్ మిస్టర్ డెస్టినీ, ది డేస్ వీ లవ్డ్‌తో పాటు ఇతర మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది. ‘స్నోడ్రాప్’ అనే కొరియన్ షోలోనూ పని చేసింది. ఈ షోతోనే ఆమెకు మంచి గుర్తింపుతో పాటు పాపులారిటీ వచ్చి పడింది. ఇలా ఆమె కెరీర్ విజయవంతంగా సాగుతున్న క్రమంలో.. విధి మరో రాత రాసింది. ఆమెను తక్కువ వయసులోనే తీసుకెళ్లిపోయింది. ఈమె మృతదేహానికి జూన్ 13న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలావుండగా.. అంత్యక్రియలు నిర్వహించడానికి ముందు, పార్క్ సూ ర్యున్ అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. తమ కూతురి మెదడు మాత్రమే చనిపోయిందని, గుండె ఇంకా కొట్టుకుంటోందని ఆమె తల్లి పేర్కొంది. గుండెతో పాటు ఇతర అవయవాలు అసరమున్న వాళ్లు ఈ ప్రపంచంలోనే చాలామంది ఉన్నారని, వారికి దానం చేయాలని నిర్ణయించామన్నారు. పార్క్ హృదయం మరో వ్యక్తిలో కొట్టుకుంటుందని అనుకుంటే, తల్లిదండ్రులుగా తాము సంతోషిస్తామని తెలిపారు.
Botsa Satyanarayana: డ్యాన్సులు చేసుకునే వ్యక్తి మనకు సీఎంగా అవసరమా.. బొత్స కౌంటర్