Site icon NTV Telugu

కిమ్ సోద‌రి మ‌రో హెచ్చ‌రిక‌: సౌత్ కొరియా ఆ ప‌ని చేస్తే…

ఉత్త‌ర‌, ద‌క్షిణ కొరియాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.  కొన్ని నెల‌ల క్రితం రెండు దేశాల మ‌ధ్య ఏర్పాటు చేసిన హాట్‌లైన్‌ను ధ్వంసం చేశారు.  మ‌రోసారి కొరియా యుద్ధం త‌ప్ప‌దేమో అన్నంత‌గా ప‌రిణామాలు మారిపోయాయి.  అయితే, నెల రోజుల క్రితం నుంచి క్ర‌మంగా మార్పులు చోటుచేసుకున్నాయి.  రెండు దేశాల స‌రిహ‌ద్దుల్లో ద్వంసం చేసిన కార్యాల‌యాల‌ను తిరిగి ఏర్పాటు చేశారు.  ఇరుదేశాల అధినేత‌లు హాట్‌లైన్‌లో మూడుసార్లు చ‌ర్చించుకున్నారు.  కొరియా మ‌ధ్య స‌యోధ్య కుదిరితే బాగుంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు.  

Read: ఏపీలో పెరిగిన కరోనా కేసులు…

ఇక ఇదిలా ఉంటే, వ‌చ్చే నెల‌లో ద‌క్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా మిల‌ట‌రి డ్రిల్ ను నిర్వ‌హించ‌బోతున్నాయి.  దీనిపై ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ సోద‌రి కిమ్ యో జంగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  అమెరికాతో క‌లిసి ద‌క్షిణ కొరియా మిల‌ట‌రి డ్రిల్‌ను నిర్వ‌హిస్తే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని, ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు తిరిగి గాడిన ప‌డుతున్నాయని, ఈ డ్రిల్ తో అవి పూర్తిగా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంద‌ని, ఈ డ్రిల్ వ‌ల‌న త‌మ దేశానికి ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంటుంద‌ని, ద‌క్షిణ కొరియాపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి కూడా వెన‌కాడ‌బోమ‌ని కిమ్ యో జంగ్ హెచ్చ‌రించారు. 

Exit mobile version