North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
- 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల అమలు..
- నార్త్ కొరియా నుంచి తప్పించుకుని సౌత్ కొరియాకు..
- కిమ్ రాజ్యం నుంచి బయటపడిన ఓ కుటుంబం కథ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా ఒక నిగూఢ దేశం. ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ దేశ ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. కిమ్ జాంగ్ ఉన్ రాజ్యంలో రూల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్వోన్నత నాయకుడిని ప్రశ్నిస్తే ఉరిశిక్షే గతి. ఇదే కాకుండా దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన పాటలు విన్నట్లు తెలిసినా, సినిమాలు చూసినట్లు తెలిసినా మరణమే శరణ్యం. ఇక దేశం విడిచి వెళ్లాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఆ వ్యక్తితో పాటు అతడి కుటుంబం కఠినమైన శిక్షల్ని ఎదుర్కోవాల్సిందే.
10 ఏళ్ల ప్లానింగ్..
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
అలాంటి నిఘా ఉన్న కిమ్ రాజ్యం నుంచి ఒక కుటుంబం సాహసోపేతంగా తప్పించుకుంది. నార్త్ కొరియా నుంచి స్వేచ్ఛ పొందింది. ల్యాండ్ ద్వారా కాకుండా అత్యంత కఠినమైన సముద్ర మార్గం ద్వారా కుటుంబానికి చెందిన 9 మంది తప్పించుకోవడం సంచలనం. ఇది ఊరికే జరగలేదు. దీని వెనక 10 ఏళ్ల ప్రణాళిక దాగి ఉంది. ఈ ప్రణాళికను కేవలం రెండు గంటలు అమలు చేసి ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా చేరి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకున్నారు.
కిమ్ యి హ్యోక్ కుటుంబంలోని 9 మంది సురక్షితంగా నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకు చేరిన కథ చాలా ఇంట్రెస్టింగ్. ముందుగా కుటుంబంలో చిన్న కొడుకుగా ఉున్న కిమ్ యి హ్యోక్ ఉత్తర కొరియా తీర ప్రాంతానికి పని కోసం వెళ్లాడు. అతను కొన్నేళ్ల పాటు అక్కడే చేపల వేట నేర్చుకున్నాడు. పడవ మరమ్మతులు, వాతావరణం, సముద్ర మార్గాలు, కిమ్ సైనికులు గస్తీ కాచే విధానం, సముద్ర వాతావరణంపై పూర్తిగా పట్టు సాధించాడు. వివాదాస్పద సముద్ర సరిహద్దు నార్తర్న్ లిమిట్ లైన్ (NLL) సమీపంలో గస్తీ నమూనాలను అధ్యయనం చేయడానికి, నిఘాలోని లోపాలను గుర్తించడానికి ఆ కాలాన్ని ఉపయోగించుకున్నారు.
సాధారణ వ్యక్తిగా కనిపించేందుకు, సైనికులకు అనుమానం రాకుండా వారితో పరిచయాలు పెంచుకున్నాడు. అనేక సార్లు వారికి లంచాలు ఇచ్చాడు. ఇలా అనుమానం రాకుండా వ్యవహరించాడు. చైనా నుంచి అక్రమంగా తెచ్చిన టీవీ ద్వారా దక్షిణ కొరియా జీవన విధానంపై ఆశ పెంచుకున్న ఆ కుటుంబం, నార్త్ కొరియా నరక కూపం నుంచి బయటపడాలని భావించింది.
2 గంటల గ్రేట్ ఎస్కేప్:
2023లో మేలో కిమ్ ఇల్ హ్యోక్ భార్య గర్భిణిగా ఉన్న సమయంలో తన ప్లాన్ అమలు చేసింది ఆ కుటుంబం. భారీ వర్షం పడుతున్న సమయంలో రాత్రి వేళ దేశం దాటాలని భావించింది. ఇందుకు వారు అత్యంత కఠిన పరిస్థితులు ఉన్న ఎల్లో సీ మార్గాన్ని ఎంచుకున్నారు. చేపల వేటకు వెళ్తున్నామని అనుమతి తీసుకుని ప్లాన్ అమలు చేశారు. కుటుంబంలోని మహిళల్ని ముందుగా రహస్యంగా తీరానికి తీసుకువచ్చారు. పిల్లల్ని సంచుల్లో దాచారు. మొత్తం కుటుంబం పడవ ఎక్కింది. రాత్రి సమయంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో ఉత్తర కొరియా సైన్యానికి దొరికితే మరణమే గతి. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో 2 గంటల పాటు సముద్రంలో ప్రయాణించి ఉత్తర కొరియా సరిహద్దుల్ని దాటారు. యోన్‌ప్యోంగ్ ద్వీపం కనిపించిందని, ఆ తర్వాత తమ సెర్చ్ లైట్ వేయడంతో దక్షిణ కొరియా నేవీ తమను రక్షించిందని చెప్పారు. దక్షిణ కొరియా ప్రకరాం.. ఇప్పటి వరకు 35 వేల మంది ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చారు. ఇలా పారిపోయి వచ్చినవారిలో ఎక్కువ మంది మహిళలే.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?