NTV Telugu Site icon

Iran: హిజ్బుల్లా కమాండర్లని చంపితే ఓటమి కాదు..ఇజ్రాయిల్‌పై ఇరాన్ వ్యాఖ్యలు…

Iran

Iran

Iran: ఇజ్రాయిల్, లెబనాన్‌లో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. వరసగా దాడులు నిర్వహిస్తోంది. గత వారం పేజర్ల దాడి జరిగిన తర్వాత లెబనాన్‌పై దాడుల్ని విస్తృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ హిజ్బుల్లాకు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. హిజ్బుల్లా కమాండర్లను హతమార్చడం హిజ్బుల్లాని మోకాళ్లపైకి తీసుకురాదని అన్నారు. హిజ్బుల్లా సంస్థాగత బలం, మానవ వనరులు చాలా బలంగా ఉన్నాయని, ఒక సీనియర్ కమాండర్‌ని చంపడం వల్ల అది నష్టపోదని ఖమేనీ చెప్పారు.

Read Also: Success Tips: ఈ అలవాట్లు ఉంటే జీవితంలో సక్సెస్ అవ్వలేరు..

లెబనాన్ ఆరోగ్య మంత్రి ప్రకారం.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ సోమవారం నుంచి జరుపుతున్న దాడుల్లో 569 మంది మరణించారు. దాదాపుగా రెండు దశాబ్ధాల తర్వాత లెబనాన్ ఇజ్రాయిల్ నుంచి భీకరదాడిని ఎదుర్కొంది. పాలస్తీనా, లెబాన్ ప్రతిఘటన అంతిమ విజయం సాధింస్తుందని ఖమేనీ అన్నారు. ఇజ్రాయిల్ తన శత్రువుల్ని ఓడించలేక పౌరులను చంపుతోందని ఆరోపించారు.

గతేడాది అక్టోబర్ 07 నాటి దాడుల తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్‌పై విరుచుకుపడుతోంది. అయితే, హమాస్‌కి మద్దతు నిలుస్తామని పలు సందర్భాల్లో హిజ్బుల్లా ప్రకటించింది. లెబనాన్ నుంచి ఉత్తర ఇజ్రాయిల్ ప్రాంతం నుంచి దాడులు చేస్తోంది. హమాస్ యుద్దం ప్రారంభమైన ఏడాది తర్వాత ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఆ మిలిటెంట్ సంస్థలోని కీలక కమాండర్లను హతం చేసినట్లు చెప్పింది. గతంలో ఫువాద్ షుక్ర్‌ని, ఇటీవల ఇబ్రహీం అఖిల్‌ని హతం చేసినట్లు ప్రకటించింది. ఆ సంస్థ టాప్ -9 లీడర్లలో ఆరుగురిని ఎలిమినేట్ చేసినట్లు వెల్లడించింది.