Site icon NTV Telugu

Kilauea Volcano Erupt: కిలాయుయా అగ్నిపర్వతం బద్ధలు..

Kilauea Volcano Erupt

Kilauea Volcano Erupt

Kilauea Volcano In Hawaii Erupts Again: హవాయిలోని కిలాయుయా అగ్నిపర్వతం మళ్లీ పేలింది. జనవరి 5 నుంచి అగ్నిపర్వతం బద్ధలు అవుతూనే ఉంది. గత నవంబర్ లో దీనికి సమీపంలోనే ఉన్న ‘మౌనాలోవా’ అగ్ని పర్వతం పేలింది. ఆ తరువాత ప్రస్తుతం ‘కిలాయుయా’ అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడుతోంది. భూమిపై ప్రస్తుతం అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వాతాల్లో కిలాయుయా ఒకటి.

Read Also: Joshimath Sinking: కుంగిపోతున్న జోషిమఠ్ పట్టణం.. కారణాలు ఇవే అంటున్న నిపుణులు

హవాయిలోని వాల్కానో నేషనల్ పార్క్ లోని కిలౌయా జనవరి 5న విస్పోటనం చెందడం ప్రారంభించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే.. అగ్నిపర్వత శిఖరం వద్ద లావా ప్రవహిస్తోందని.. అగ్నిపర్వతం విస్పోటనం కావచ్చని గురువారం హెచ్చరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద అగ్ని పర్వతం అయిన మౌనాలోవా నవంబర్ 7,2022న, 38 ఏళ్ల తరువాత తొలిసారి పేలింది. రెండు వారాల పాటు అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడింది. ప్రస్తుతం కిలాయుయా ఎప్రిల్ 2021లో విస్పోటనం చెందింది. ఆ ఏడాది ఆగస్టు వరకు ఇలాగే పేలుళ్లు సంభవించాయి. ఈ సమయంలో వందలాది ఇళ్లు నాశనం అయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు మరోసారి కిలాయుయా అగ్నిపర్వతం విస్పోటనం చెందుతోంది.

ప్రపంచంలో హవాయిలోనే అత్యధిక క్రియాశీలమైన అగ్ని పర్వతాలు ఉన్నాయి. మొత్తం 6 అగ్ని పర్వతాలు ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నాయి. అమెరికాకు చెందిన హవాయి పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న దీవుల సముదాయం. ఇక్కడ ఒక్కో దీవి ఒక్కో అగ్నిపర్వతాన్ని కలిగి ఉంది. భూమి ఏర్పడిన తర్వాత 70 మిలియన్ సంవత్సరాల నుంచి ఈ అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉంటున్నాయి.

Exit mobile version