Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం
- ఎంపీ పదవికి కూడా రాజీనామా
- త్వరలో హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్‌కు బైపోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్ నియోజకవర్గం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. గత నెలలో లేబర్ పార్టీ నాయకత్వంతో పాటు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన స్టార్మర్.. పార్లమెంట్లో బ్యాక్‌బెంచర్‌గా కొనసాగుతారని తొలుత భావించారు. అయితే తాజాగా ఆయన ఎంపీ పదవి నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
పార్లమెంట్ వేసవి విరామం అనంతరం తిరిగి సమావేశమైన సందర్భంగా 63 ఏళ్ల మాజీ న్యాయవాది స్టార్మర్ సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. వేసవి కాలంలో తన భవిష్యత్తుపై విస్తృతంగా ఆలోచించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. “హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్ ఎంపీ పదవి నుంచి తప్పుకుని.. నా స్థానాన్ని తదుపరి వ్యక్తికి అప్పగించడానికి ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నాను” అని స్టార్మర్ పేర్కొన్నారు.
Also Read
- Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
- Iran Nuclear Talks: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
- Maryam Nawaz: సీఎం వస్తున్నారని పరీక్షలాపేస్తారా? పాక్ సర్కార్ తీరుపై భగ్గుమన్న తల్లిదండ్రులు!
అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి
పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండి కీలకమైన ఇతర అంశాలపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తనకు అవకాశం కల్పిస్తుందని స్టార్మర్ తెలిపారు. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవహారాలు, రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతిక రంగాలపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై మరింత సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు, బాలికలపై హింసను అరికట్టే అంశంపై కూడా తన కృషిని కొనసాగిస్తానని స్టార్మర్ తెలిపారు. ఈ సమస్యపై తాను దశాబ్దాలుగా పనిచేస్తున్నానని చెప్పారు. హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు ఎప్పటికీ గర్వపడతానని, తాను, తన కుటుంబం నివసించే ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు.
2015 నుంచి ఎంపీగా..
కీర్ స్టార్మర్ 2015 నుంచి హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పటి లేబర్ ఎంపీ ఫ్రాంక్ డాబ్సన్ నుంచి ఆయన ఈ స్థానాన్ని స్వీకరించారు. ఇప్పుడు స్టార్మర్ రాజీనామాతో ఈ నియోజకవర్గ ఓటర్లు కొత్త ఎంపీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. స్టార్మర్ డౌనింగ్ స్ట్రీట్‌తో పాటు లేబర్ పార్టీ నాయకత్వాన్ని విడిచిపెట్టి కొన్ని వారాలు మాత్రమే అవుతోంది. ఆయన స్థానంలో ఆండీ బర్న్‌హామ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. స్టార్మర్ మాత్రం ఎంపీగా కొనసాగుతూ బ్యాక్‌బెంచ్ నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తారని తొలుత అంచనాలు ఉన్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ఆ అంచనాలకు తెరపడింది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీ 100 సెంచరీల వేట.. గిల్, అయ్యర్‌కు తప్పిన చిక్కు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
-
IND vs NZ 3rd ODI: అక్షర్ పటేల్ ఎందుకు.. అతడే సరైనోడు.. మూడో వన్డేలో ఛాన్స్ ఇవ్వండి!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
ట్రెండింగ్
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!