NTV Telugu Site icon

Nobel Prize: కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి దారి.. ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి..

Noble Prize

Noble Prize

Nobel Prize: ప్రపంచంలో అత్యున్నత బహుమతైన ‘నోబెల్ ఫ్రైజ్’ ప్రకటన ప్రారంభమైంది. వైద్యశాస్త్రంలో అత్యున్నత కృషి చేసింనదుగానూ కాటాలిన్ కారిడో, డ్రూ వీస్‌మాన్‌లను నోబెల్ బహుమతిని సోమవారం ప్రకటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిని కోవిడ్19ని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్‌ తయారీకి ఇరువురు పరిశోధనలు కీలకమయ్యాయి. వ్యాక్సిన్ తయారీకి మార్గాన్ని సుగమం చేసిన మెసెంజర్ ఆర్ఎన్ఏ(ఎంఆర్ఎన్ఏ) సాంకేతికతపై ఇరువురు పరిశోధలు చేశారు.

ఆధునిక కాలంలో మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పుగా ఉన్న కోవిడ్ 19ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారీకి వీరిద్దరు దోహదపడ్డారని జ్యూరీ పేర్కొంది. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమెస్ట్రీ, గురువారం సాహిత్యం విభాగాల్లో విజేత పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ పీస్ ఫ్రైజ్, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు.

Read Also: PM Modi: కన్హయ్యలాల్‌ తల నరికి చంపితే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది.

ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను ఉపయోగించి మొదటిసారిగా ఫైజర్ బయోటెక్, మోడెర్నా కోవిడ్ వ్యాకిన్లను తయారు చేసింది. హంగేరికి చెందిన కారికో, అమెరికాకు చెందిన వీస్‌మాన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో సహచరులు. వీరు వైద్యశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు.

బలహీన వైరస్ లేదా వైరస్ ప్రోటీన్ల భాగాలను ఉపయోగించే సాంప్రదాయ వ్యాక్సిన్లలా కాకుండా mRNA వ్యాక్సిన్లు జన్యు అణువులను అందిస్తాయి, దీని ద్వారా రోగనిరోధక కణాలకు ఏ ప్రొటీన్లు తయారు చేయాలో తెలియజేస్తాయి. నిజమైన వైరస్ ని ఎదుర్కొన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ శిక్షణ ఇస్తుంది. క్యాన్సర్, ఇన్ఫ్లుఎంజా, గుండె వైఫల్యం వంటి వ్యాధులు, అనారోగ్యాలకు ఇతర చికిత్సలను అభివృద్ధి చేయడానికి కారికో, వీస్‌మాన్ యొక్క mRNA సాంకేతికత ఇప్పుడు ఉపయోగించబడుతోంది.